
పోస్ట్ ఆఫీస్‌లో అనేక పొదపు పథకాలు అనేవి ఉన్నాయి. వీటిల్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది పొదుపు చేసుకుంటున్నారు. తక్కువ ఆదాయంతో ఎక్కువ పెట్టుబడి వీటిల్లో సంపాదించవచ్చు. కేంద్ర ప్రభుత్వ మీ డబ్బలుకు గ్యారెంటీ కూడా అందిస్తోంది. దీని వల్ల మీ నగదుకు పూర్తిగా భద్రత లభిస్తుంది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే వీటిల్లో ఎక్కువ వడ్డీ లభిస్తుంది. దీంతో ఎలాంటి రిస్క్ లేని ఆదాయం కావాలనుకునేవారు పోస్టాఫీసు స్కీముల్లో పెట్టబడులు పెడుతూ ఉంటారు. గ్రామస్థాయి వరకు పోస్టాఫీస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి సులువుగా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న పథకాల్లో బాగా పాపులర్ అయిన స్కీమ్ ఉన్నాయి. అందులో ఒకటి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS) ఒకటి. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడిచే ఒక ప్రముఖ పొదుపు పథకం ఇది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే స్థిరమైన నెలవారీ వడ్డీ ఆదాయం పొందవచ్చు. ఈ స్కీమ్ ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
ఈ పథకం స్పెషాలిటీ ఏంటంటే.. ప్రతీ నెలా మీరు ఆదాయం పొందవచ్చు. మీరు జమ చేసిన డబ్బులపై ప్రతీ నెలా వడ్డీ జమ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒకేసారి రూ.15 లక్షల పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.9,250 వరకు వడ్డీని సంపాదించవచ్చు. స్థిరమైన, సురక్షితమైన ఆదాయ వనరును కోరుకునే వారికి ఇది సురక్షితమైన స్కీమ్ అని చెప్పవచ్చు. చిన్న మొత్తాల పొదుపుతో కూడా నెలవారీ ఆదాయాన్ని పొందడానికి ఇది సహాయపడుతుంది. పోస్ట్ ఆఫీసుల్లో మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది. మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనకరమైనదిగా చెప్పవచ్చు. ఈ పథకంలో కనీసం రూ1,000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. మీ ఆర్ధిక స్తోమతను బట్టి రూ.15 లక్షల వరకు జమ చేసుకోవచ్చు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఒకేసారి పెట్టుబడి పెడితే ఐదేళ్ల కాలానికి ప్రతి నెలా వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్ల జమ అవుతూ ఉంటుంది. మీ ఆర్ధిక అవసరాలను తీర్చడంలో ఈ నగదు సహాయపడతాయి.
ఉదాహరణకు మీరు జాయింట్ ఖాతా తెరిచి గరిష్ట పరిమితి అయిన రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు ఏడాదికి రూ.1,11,000 వడ్డీ లభిస్తుంది. అంటే ప్రతి నెలా మీ ఖాతాలోకి రూ.9,250 నేరుగా క్రెడిట్ అవుతున్నట్లు లెక్క. ఒకవేళ మీరు రూ.5 లక్షలు జమ చేస్తే నెలకు దాదాపు రూ.3,083 వడ్డీ అందుతాయి. సింగిల్ ఖాతాలో రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు రూ.5,550 వడ్డీ రూపంలో అందుతాయి. అయితే డిపాజిట్ చేసే అసలు మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. ప్రతి నెలా వచ్చే వడ్డీని పూర్తిగా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా పరిగణిస్తారని చెప్పవచ్చు.