Credit Cards: క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తున్నారా..? ఈ విషయం తెలుసుకోకపోతే బొక్క బోర్లా పడతారు..

ఇటీవల కాలంలో చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు అనేక అనుమానాలు, అపోహలు ఉంటాయి. ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడితే నష్టం జరుగుతుందని అనుకుంటుంటారు. అలాగే కార్డు క్లోజ్ చేస్తే సిబిల్ పెరుగుతుందని భావిస్తుంటారు. ఇందులో అసలు నిజముందా..?

Credit Cards: క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తున్నారా..? ఈ విషయం తెలుసుకోకపోతే బొక్క బోర్లా పడతారు..
Credit Cards

Updated on: May 06, 2026 | 2:04 PM

ఆర్ధిక అవసరాల దృష్ట్యా ఇప్పట్లో ప్రతీఒక్కరూ క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు. అత్యవసర నగదు అవసరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కొంతమంది వాడుతుంటే.. మరికొంతమంది ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమంది అప్పులపాలవుతామేమోనని వీటిని తీసుకునేందుకు భయపడుతుంటారు. ఇక క్రెడిట్ కార్డు తీసుకుంటే సిబిల్ స్కోర్ పడిపోతుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డులు పర్మినెంట్‌గా క్లోజ్ చేయడం కూడా సిబిల్‌పై ప్రభావితం చూపుతుందని డౌట్ పడుతుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇందులో చూద్దాం.

క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా..?

క్రెడిట్ కార్డును చాలామంది లోన్‌గా భావిస్తూ ఉంటారు. బ్యాంక్ ఇచ్చే రుణంగా దీనిని అనుకుంటారు. దీని వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుందేమోనని అపోహ పడుతూ ఉంటారు. అయితే ఇది నిజం కాదు. క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు ఖర్చు చేసి తిరిగి గడువులోగా చెల్లిస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అదే బిల్లు డ్యూ డేట్‌కి చెల్లించకపోతే మాత్రం క్రెడిట్ స్కోర్ పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక కార్డు తీసుకున్న తర్వాత దానిని శాశ్వతంగా క్లోజ్ చేస్తే స్కోర్‌ పెరుగుతుందని అనుకుంటుంటారు. అయితే ఇందులో నిజం లేదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే లిమిట్, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో తగ్గుతుంది. దీని వల్ల క్రెడిట్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే..

ఇక ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగి ఉంటే మంచిదనే భావన చాలామందిలో ఉంటుంది. అయితే అలాంటిది ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని కార్డులు ఉన్నా వాటిని సరిగ్గా మేనేజ్ చేస్తే లాభం జరుగుతుందని చెబుతున్నారు. సకాలంలో బిల్లు చెల్లించడం, లిమిట్‌లో 30 శాతం మాత్రమే వాడుకోవడం వంటివి పాటించడం వల్ల సిబిల్ పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక మినిమం డ్యూ చెల్లిస్తే ఇబ్బంది ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ దీని వల్ల లేట్ ఫీజులు, పెనాల్టీల నుంచి మాత్రమే తప్పించుకోవచ్చు. ఇక ఏ రకాలుగా బెనిఫిట్ ఉండదు.

Follow Us