Parcel Scam: ఇలాంటి మెసేజ్‌లను క్లిక్‌ చేస్తున్నారా? మీ పని అయిపోయినట్లే..!

|

Jul 28, 2024 | 12:00 PM

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు మీరు వస్తువులను విక్రయించడానికి నకిలీ వెబ్‌సైట్ల గురించి విని ఉంటారు. అనేక సందర్భాల్లో స్కామర్‌లు వినియోగదారులను ఆఫర్‌లతో ఆకర్షిస్తూ వారి నుంచి డబ్బు వసూలు..

Parcel Scam: ఇలాంటి మెసేజ్‌లను క్లిక్‌ చేస్తున్నారా? మీ పని అయిపోయినట్లే..!
Scam
Follow us on

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు మీరు వస్తువులను విక్రయించడానికి నకిలీ వెబ్‌సైట్ల గురించి విని ఉంటారు. అనేక సందర్భాల్లో స్కామర్‌లు వినియోగదారులను ఆఫర్‌లతో ఆకర్షిస్తూ వారి నుంచి డబ్బు వసూలు చేసేందుకు నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టిస్తారు. అయితే ఈసారి మోసగాళ్లు కొత్త ట్రిక్‌కు శ్రీకారం చుట్టారు. ఇక్కడ పార్శిల్ స్కామ్ గురించి తెలుసుకుందాం.

పార్శిల్ స్కామ్ అంటే ఏమిటి?

ప్రస్తుతం పార్శిల్ స్కామ్ శరవేగంగా నడుస్తోంది. అటువంటి సందర్భాలలో స్కామర్లు వినియోగదారులకు రకరకాల సందేశాలను పంపుతారు. మీ అడ్రస్ తప్పుగా ఉన్నందున పార్శిల్ డెలివరీ చేయడం సాధ్యం కాదని, డెలివరీని స్వీకరించడానికి చిరునామాను అప్‌డేట్ చేయండి అని మెసేజ్ చెబుతోంది. ఈ పని కోసం మీరు సందేశంలో అందించిన లింక్‌పై క్లిక్ చేయమని అడుగుతారు. ఒక వ్యక్తి మోసపోయి లింక్‌పై క్లిక్ చేస్తే మీ పని అయిపోయినట్లే.

ఇది కూడా చదవండి: Condom: Gold Price: షాకింగ్‌ న్యూస్‌.. మళ్లీ బంగారం ధర భారీగా పెరిగే అవకాశం.. ఎంతో తెలిస్తే షాకవుతారు!

మోసాలపై హెచ్చరించింది:

మీరు ఏ తెలియని లింక్‌పై క్లిక్ చేయకూడదని గుర్తుంచుకోండి. లేదంటే స్కామర్‌లు మీ బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. లింక్ ద్వారా మీ ఫోన్‌లో వైరస్ ఇన్‌స్టాల్ చేయబడే అవకాశం ఉంది. హ్యాకర్లు మీ మొబైల్‌ను గానీ, ల్యాప్‌టాప్‌ను గానీ హ్యాక్ చేసే అవకాశం ఉంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే సోషల్ మీడియా ఖాతా అయిన సైబర్ దోస్త్ ఇలాంటి మోసాల గురించి వినియోగదారులను హెచ్చరించింది. మీకు అలాంటి సందేశం వస్తే, అది స్కామ్ కావచ్చు. ఇలాంటి మెసేజ్‌లను పట్టించుకోకుండా జాగ్రత్తపడటం చాలా ముఖ్యం.

  1. ఆకస్మిక సందేశం : మీరు ఇటీవల ఆర్డర్ చేయకుంటే, మీకు అలాంటి సందేశం వచ్చినట్లయితే అది స్కామ్ కావచ్చు.
  2. అనుమానాస్పద లింక్‌లు: అనుమానాస్పద లేదా తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి.
  3. భాషలో లోపాలు: వ్యాకరణం, భాషా లోపాలు లేదా అసాధారణ భాష కూడా స్కామ్‌కు సంకేతం కావచ్చు.
  4. త్వరగా పని చేయమని ఒత్తిడి: స్కామ్ సందేశాలు సాధారణంగా త్వరగా పని చేయమని ఒత్తిడి చేస్తాయి. “ఇప్పుడే క్లిక్ చేయండి” అనే సందేశం మీకు పంపిన మెసేజ్‌లో ఉంటుంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

పార్శిల్ స్కామ్‌లను ఎలా నివారించాలి?

  1. సందేశాన్ని విస్మరించండి: ఏదైనా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయవద్దు. అలాంటి మెసేజ్‌లను విస్మరించడం మంచిది.
  2. కంపెనీతో ప్రత్యక్ష పరిచయం : ఈ సందేశం నిజమైనదని మీరు భావిస్తే, కొరియర్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి నేరుగా వెళ్లండి లేదా వారి అధికారిక కస్టమర్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయండి.
  3. మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు : అనుమానాస్పద వెబ్‌సైట్‌లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని లేదా బ్యాంక్ వివరాలను ఎప్పుడూ షేర్ చేయవద్దు.

ఇది కూడా చదవండి: Condom: కండోమ్స్‌ అతని జీవితాన్నే మార్చేసింది.. దురదృష్టాన్ని నెట్టేసి అదృష్టాన్ని తట్టి లేపింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి