PAN Card: పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!

PAN Card: పాన్ కార్డు అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. బ్యాంక్ అకౌంట్లు తెరిచేందుకు సహా టాక్స్ చెల్లించేందుకు, ఉద్యోగం కోసం, ఇతర చాలా ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు అనేది తప్పనిసరి. ఇది చాలా..

PAN Card: పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
Pan Card

Updated on: May 30, 2026 | 4:17 PM

PAN Card: పాన్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. ఈ మార్పులు జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే శుభవార్త ఏమిటంటే ఒకే రోజులో రూ.50,000 కంటే ఎక్కువ నగదు జమ చేయడానికి ఇకపై పాన్ కార్డు అవసరం లేదు. దానికి బదులుగా, ఒక ఆర్థిక సంవత్సరంలో మీ అన్ని బ్యాంకు ఖాతాల నుండి చేసే మొత్తం నగదు డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్ రూ.10 లక్షలు దాటితే మాత్రమే మీరు మీ పాన్ కార్డును అందించాల్సి ఉంటుంది. అయితే, ఆస్తి లావాదేవీలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్‌లో రూ.50 వేలు డిపాజిట్‌ చేసినట్లయితే పాన్‌ కార్డు ఇవ్వాల్సి ఉండేది. ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదు.

అంతేకాకుండా, ఆస్తి కొనుగోళ్లు, అమ్మకాల కోసం పాన్ పరిమితిని రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచారు. అయితే, సంవత్సరానికి రూ.10 లక్షలు మించిన నగదు ఉపసంహరణలకు, రూ.45 లక్షలు మించిన రియల్ ఎస్టేట్ లావాదేవీలకు పాన్ తప్పనిసరిగా ఉంటుంది. పాన్ లేని పక్షంలో పాత ఫారం 60కి బదులుగా ఇప్పుడు కొత్త ఫారం 97 అవసరం అవుతుంది.

ఇది కూడా చదవండి: RBI: పెద్ద నోట్ల రద్దు తర్వాత 10 ఏళ్లకు ఆర్బీఐ మరో కీలక మార్పుకు సన్నాహాలు

పాన్ కార్డు అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. బ్యాంక్ అకౌంట్లు తెరిచేందుకు సహా టాక్స్ చెల్లించేందుకు, ఉద్యోగం కోసం, ఇతర చాలా ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు అనేది తప్పనిసరి. ఇది చాలా ముఖ్యమైన గుర్తింపు పత్రం. కొన్ని చిన్న చిన్న లావాదేవీల్లో పాన్ అవసరం నిబంధనల్ని సడలిస్తూనే ఇదే సమయంలో కొన్ని భారీ విలువ కలిగినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ప్రాపర్టీ డీల్స్, ఈవెంట్ పేమెంట్స్ వంటి అంశాలపై పర్యవేక్షణ మరింత కఠినతరం చేసింది. ఇంకా ముఖ్యంగా గతంలో పాన్ కార్డు లేకపోయినా ఫారం- 60 ద్వారా కొన్ని లావాదేవీలు చేసుకోవడానికి వీలుండేది. ఇప్పుడు దీని బదులుగా కొత్తగా ఫారం- 97 ప్రవేశపెట్టారు.

ఇది కూడా చదవండి: Washing Machine: వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? ఓవర్‌ లోడ్‌ అయితే ఏమవుతుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us