Oppo A93 5G Smartphone: మార్కెట్లోకి ఒప్పో ఎ93 5జీ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల.. 128జీబీ స్టోరేజీ

|

Jan 16, 2021 | 10:12 PM

Oppo A93 5G Smartphone: ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ వాడకం ఎక్కువైపోయింది. వివిధ మొబైల్‌ కంపెనీలు కూడా రోజురోజుకు కొత్త మోడల్‌ మొబైళ్లను కస్టమర్లకు అందుబాటులోకి ....

Oppo A93 5G Smartphone: మార్కెట్లోకి ఒప్పో ఎ93 5జీ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల.. 128జీబీ స్టోరేజీ
Follow us on

Oppo A93 5G Smartphone: ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ వాడకం ఎక్కువైపోయింది. వివిధ మొబైల్‌ కంపెనీలు కూడా రోజురోజుకు కొత్త మోడల్‌ మొబైళ్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ఒప్పో నుంచి 5జీ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చేసింది. అందుబాటులోకి వచ్చిన ‘ఒప్పో ఎ93 5జీ’ మొబైల్‌ సరికొత్త క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 480 ఎస్‌ఓసీని ఉపయోగించారు. ట్రిపుల్‌ రియల్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటివి ఉన్నాయి. అలాగే సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫుల్‌ హెచ్‌డీ హూల్‌ పంచ్‌ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఈ మొబైల్‌లో ఉన్నాయి.

కాగా, ఒప్పో ఎ93 5జీ 8జీబీ+256 స్టోరేజీ. ఇందులో 128 జీబీ స్టోరేజీ. ధరను మాత్రం వెల్లడించకపోయినా.. మోడల్‌ ధర భారత కరెన్సీలో దాదాపు రూ.22,500 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 20న షిప్పింగ్‌ ప్రారంభం కానుంది. కాగా, ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 11.1, 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, ముందు వైపు 8 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ వంటివి ఉన్నాయి.

Apple Cashback Offer: ఈనెల 21 నుంచి బంపర్‌ ఆఫర్‌.. రూ. 5 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించిన యాపిల్