Ola: వారెవ్వా.. ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేస్తోంది, స్టైలిష్‌ డిజైన్‌తో పాటు..

|

Aug 09, 2024 | 7:00 PM

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉపయోగించాలని ఇష్టం ఉన్నా. స్పోర్ట్స్‌ లుక్‌ బైక్‌ కోసం కొందరు వీటికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ ’తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్’ను లాంచ్‌ చేసేంకు సిద్ధమైంది....

Ola: వారెవ్వా.. ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేస్తోంది, స్టైలిష్‌ డిజైన్‌తో పాటు..
Ola
Follow us on

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉపయోగించాలని ఇష్టం ఉన్నా. స్పోర్ట్స్‌ లుక్‌ బైక్‌ కోసం కొందరు వీటికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ ’తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్’ను లాంచ్‌ చేసేంకు సిద్ధమైంది. ఇప్పటి వరకు స్కూటీ విభాగంలోనే టూ వీలర్స్‌ను లాంచ్‌ చేసిన సంస్థ తాజాగా బైక్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే ‘సంకల్ప్ 2024’ వేడుకలో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ కం ఫౌండర్ భవిష్ అగర్వాల్ ఈ కొత్త బైక్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఇప్పటి వరకు ఓలా నుంచి వచ్చిన ఓలా ఎస్1ఎక్స్, ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో స్కూటర్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీన ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ను లాంచ్‌ చేయనున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టోర్క్ క్రటోస్ ఆర్, రివోల్ట్ ఆర్వీ 400, ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 2, మాస్టర్ ఏరియా వంటి ఎలక్ట్రిక్‌ బైక్‌లకు పోటీనిచ్చేందుకు ఓలా ఈ బైక్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ బైక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రోడ్‌స్టర్‌ పేరుతో ఈ బైక్‌ను లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోది. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోల ఆధారంగా ఓలా ఈ బైక్‌ను ట్రండీ స్పోర్ట్‌ లుక్‌లో రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ బైక్‌ స్ల్పిట్‌ సీట్‌ డిజైన్‌తో రానున్నట్లు స్పష్టమవుతోంది.

 

ఈ బైక్‌లో సింగిల్‌ డిస్క్‌ బ్రేక్‌ సెటప్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ బైక్‌ డ్యూయల్-ఛానల్ ABSతో వచ్చే అవకాశం ఉంది. ఇక ఇందులో 17 ఇంచులతో కూడిన టైర్లను ఇవ్వనున్నారు. ఓలా స్కూటర్స్‌లో ఇచ్చినట్లుగానే ఇందులో కూడా పలు కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాటరీ, రేంజ్‌ వంటి వాటికి సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు. పూర్తి వివరాలు తెలియాలంటే ఆగస్టు 15వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..