ఇక ఓలా నుంచి “సెల్ఫ్ డ్రైవ్” సర్వీసులు

| Edited By:

Oct 18, 2019 | 1:09 PM

ఇప్పటి వరకు క్యాబ్ సర్వీసుల్లో రాణించిన ఓలా.. మరో ముందడుగు వేసింది. తాజాగా కస్టమర్ల ముందుకు సెల్ఫ్ డ్రైవ్‌ కార్లను కూడా తీసుకొచ్చింది. గురువారం “ఓలా డ్రైవ్” పేరుతో ఈ సేవలను బెంగళూరులో ప్రారంభించారు. ఈ సర్వీసులు ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే ఉన్నాయని.. త్వరలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఓలా డ్రైవ్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని.. రాబోయే రోజుల్లో కంపెనీ 500 మిలియన్‌ డాలర్ల వరకూ పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 2020 […]

ఇక ఓలా నుంచి సెల్ఫ్ డ్రైవ్ సర్వీసులు
Follow us on

ఇప్పటి వరకు క్యాబ్ సర్వీసుల్లో రాణించిన ఓలా.. మరో ముందడుగు వేసింది. తాజాగా కస్టమర్ల ముందుకు సెల్ఫ్ డ్రైవ్‌ కార్లను కూడా తీసుకొచ్చింది. గురువారం “ఓలా డ్రైవ్” పేరుతో ఈ సేవలను బెంగళూరులో ప్రారంభించారు. ఈ సర్వీసులు ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే ఉన్నాయని.. త్వరలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

ఓలా డ్రైవ్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని.. రాబోయే రోజుల్లో కంపెనీ 500 మిలియన్‌ డాలర్ల వరకూ పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 2020 కల్లా 20 వేల సెల్ప్‌ డ్రైవ్‌ కార్లను అందుబాటులోకి తెచ్చేలా ఓలా పని చేస్తుందన్నారు. ప్రస్తుతం ఈ కార్లను స్వల్ప వ్యవధి మేరకే రెంట్‌కు ఇవ్వనున్నామని.. అయితే భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రాతిపదికన కూడా అద్దెకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు కార్పొరేట్‌ లీజు వంటి సేవలను కూడా ప్రారంభిస్తామన్నారు.