UPI payments: ఇకపై యూపీఐ పేమెంట్స్‌ మరింత సురక్షితం.. అందుబాటులోకి కొత్త విధానం..

|

Aug 09, 2024 | 8:30 PM

ఇలాంటి మోసాలకు చెక్‌ పెట్టేందుకు, డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ను సురక్షితంగా మార్చేందుకు పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ఎప్పటికప్పుడు భద్రత చర్యలను చేపడుతూ వస్తోంది. ఇప్పటికే పలు సెక్యూరిటీ ఫీచర్లను జోడించిన ఎన్‌పీసీఐ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది...

UPI payments: ఇకపై యూపీఐ పేమెంట్స్‌ మరింత సురక్షితం.. అందుబాటులోకి కొత్త విధానం..
UPI payments
Follow us on

యూపీఐ పేమెంట్స్‌ ఎంతలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ కొట్టు మొదలు, పెద్ద పెద్ద దుకాణాల వరకు యూపీఐ పేమెంట్స్‌ను స్వీకరిస్తున్నారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు క్షణాల్లో ఇట్టే పేమెంట్స్‌ చేసే అవకాశం యూపీఐ పేమెంట్స్‌తో లభించింది. అయితే యూపీఐ పేమెంట్స్‌ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తూ.. మోసాలకు పాల్పడుతున్నారు.

ఇలాంటి మోసాలకు చెక్‌ పెట్టేందుకు, డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ను సురక్షితంగా మార్చేందుకు పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ఎప్పటికప్పుడు భద్రత చర్యలను చేపడుతూ వస్తోంది. ఇప్పటికే పలు సెక్యూరిటీ ఫీచర్లను జోడించిన ఎన్‌పీసీఐ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌ చేయడానికి నాలుగు డిజిట్ల పిన్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. అయితే ఇకపై పేమెంట్ కాన్ఫామ్‌ చేసే కంటే ముందు బయోమెట్రిక్‌ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

సాధారణంగా ప్రతీ ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఉంటుందని తెలిసిందే. అలాగే కొన్ని ఫోన్‌లలో ఫేస్‌ బయోమెట్రిక్‌ కూడా ఉంటుంది. ఈ ఫీచర్లను పేమెంట్స్‌ యాప్స్‌ కోసం ఉపయోగించుకోవాలని ఎన్‌పీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం యూపీఐ యాప్స్‌ను ఓపెన్‌ చేసే సమయంలో బయోమెట్రిక్‌ స్కాన్‌ చేసి లాగిన్‌ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై పేమెంట్ చేసే ముందు కూడా స్కాన్‌ చేసే విధానాన్ని అమలు చేయనున్నారని సమాచారం. ఇందుకోసం యూపీఐ సేవలను అందిస్తున్న గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే, పేటీఎం సహా ఇతర యాప్‌లతో చర్చలు జరుపుతోంది. అయితే, పిన్‌ లేదా బయోమెట్రిక్‌ను ఆయా కంపెనీలు ఆప్షనల్‌గా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న విధానం సింపుల్‌గానే ఉన్నా.. కొందరు సైబర్‌ నేరగాళ్లు ఆయుధంగా మలచుకుని డబ్బులు కాజేస్తున్నారు. డబ్బులు పంపిస్తామని చెప్పి యూపీఐ మనీ రిక్వెస్టులు పెట్టి.. అమాయకుల్ని దోచేస్తున్నారు. దీంతో ఈ రకమైన నేరాలకు అడ్డుకట్ట వేసేందుకే పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..