
Maruti Car: భారతీయ కార్ల మార్కెట్‌లో చవకైన ధరలో మంచి మైలేజీనిచ్చే కార్లకు ఎప్పుడూ అధిక డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు రూ.5 లక్షల లోపు ధర ఉన్న కార్ల జాబితాలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాని తక్కువ ధర, మంచి మైలేజీ, నగర డ్రైవింగ్‌కు అనువైన డిజైన్, CNG ఆప్షన్ కారణంగా ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన కారుగా నిలిచింది.
ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న అత్యంత చౌకైన కార్లలో ఒకటైన ఎస్-ప్రెస్సో. సుమారు రూ.3.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో మొదలవుతుంది. అందువల్ల తక్కువ బడ్జెట్‌లో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది. ఇందులో కాస్త ఎక్కువ ధరతో ఇతర మోడళ్లు కూడా ఉన్నాయి. కానీ ఇది ఇంత తక్కువ ప్రారంభ ధరతో ఉండటంతో మధ్య తరగతి వారికి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఈ కారులో K10C 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 63 bhp శక్తిని, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. పట్టణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణానికి ఇది మంచి పనితీరును అందిస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Credit Card: ఈ క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా 172 లీటర్ల పెట్రోల్..!
మారుతి సుజుకి ఈ కారుకు ఫ్యాక్టరీ-ఫిట్ CNG ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా మెరుగైన మైలేజీ కూడా లభిస్తుంది. పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో CNG కార్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. లీటర్ పెట్రోల్‌కు సుమారు 25.కిమీ వరకు మైలేజీ ఇస్తుండగా, సీఎన్‌జీ ఆప్షన్‌తో ఇంకా ఎక్కువ మైలేజీ ఇస్తుంది.
ఎస్-ప్రెస్సో మరో ప్రత్యేకత దాని కాంపాక్ట్ ఎస్‌యూవీ-శైలి డిజైన్. చిన్న కుటుంబాలకు, మొదటిసారి కారు కొనుగోలు చేసేవారికి ఇది ఒక మంచి ఎంపిక అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రతా ఫీచర్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ డిస్‌ప్లే కూడా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తక్కువ ధరల విభాగంలో మారుతి సుజుకి భారత మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఎస్-ప్రెస్సో కూడా బాగా రాణిస్తోంది. ఈ బడ్జెట్ ధర కారులో అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు ఈ కారును ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bank Cheque: చెక్ మీద లక్ష ఎలా రాయాలి? Lakh లేదా Lac.. చాలా మంది చేసే పొరపాటు ఇదే..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి