కనిష్ఠానికి పడిపోయిన రూపాయి.. తడబడుతున్న స్టాక్ మార్కెట్లు

| Edited By:

Aug 23, 2019 | 11:40 AM

గత మూడు రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు.. ఇవాళ కూడా అదే దిశగా సాగుతున్నాయి. ఉదయం 11.32 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 62 పాయింట్లు నష్టపోయి 36,410 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 10,747 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయి 72.01 వద్ద ట్రేడవుతోంది. వేదాంత, కోల్‌ ఇండియా, విప్రో, యస్‌ బ్యాంక్, ఇన్ఫోసిస్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్, […]

కనిష్ఠానికి పడిపోయిన రూపాయి.. తడబడుతున్న స్టాక్ మార్కెట్లు
Follow us on

గత మూడు రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు.. ఇవాళ కూడా అదే దిశగా సాగుతున్నాయి. ఉదయం 11.32 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 62 పాయింట్లు నష్టపోయి 36,410 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 10,747 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయి 72.01 వద్ద ట్రేడవుతోంది. వేదాంత, కోల్‌ ఇండియా, విప్రో, యస్‌ బ్యాంక్, ఇన్ఫోసిస్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, మారుతీ సుజుకీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.