
ఈ రోజుల్లో ప్రతీఒక్కరూ క్రెడిట్ కార్డు అనేది వాడుతున్నారు. అత్యవసర నగదు అవసరాల కోసం ఉపయోగపడుతుందని కొంతమంది వాడుతుంటే.. మరికొంతమంది ఆఫర్లు, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్ల కోసం ఉపయోగిస్తున్నారు. కొంతమంది దీని వల్ల డబ్బులు పొదుపు చేసుకుంటుంటే.. మరికొందరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి నష్టపోతున్నారు. ఇక ఇటీవల క్రెడిట్ కార్డుల ద్వారా అనేక మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి డబ్బులు కాజేస్తున్నారు. అందుకే మీ కార్డును భద్రంగా వాడుకోవాలి. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డును పొగోట్టుకుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
మీ కార్డు చోరీకి గురైనా లేదా మీరు పొగొట్టుకున్నా వెంటనే తాత్కాలికంగా బ్లాక్ చేయండి. కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా బ్లాక్ చేసుకోవచ్చు. లేదా బ్యాంకింగ్ మొబైల్ యాప్, నెట్ బ్యాంకింగ్ సేవల ద్వారా తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చు. ఇలా బ్లాక్ చేయడం ద్వారా మీ కార్డు నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్లు ఇతరులు చేయలేరు. కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేయడం కంటే మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా బ్లాక్ చేయడం బెటర్. ఎందుకంటే కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేయడం వల్ల ఆలస్యమవుతుంది. సిబ్బందికి మీ సమస్య చెప్పి బ్లాక్ చేసేందుకు సమయం పడుతుంది. ఆలోపు దొగలించిన వ్యక్తి మీ కార్డు నుంచి ట్రాన్సాక్షన్ చేయవచ్చు. అందుకే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా త్వరగా పూర్తి చేయండి.
ఇక మీ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి. ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకోండి. మీ కార్డు నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అది మీరు చేసినట్లు అవుతుంది. అదే పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయడం వల్ల మీకు నష్టం జరగదు. ఇక సిబిల్ లాంటి క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి ఫ్రాడ్ అలర్ట్ పెట్టమని చెప్పండి. దీని వల్ల ఇతరుల మీ కార్డుపై లోన్లు లేదా కార్డులు తీసుకోవడం కుదరదు. ఇక మీరు కార్డు బ్లాక్ చేసిన తర్వాత కూడా ఏమైనా లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించండి. బ్లాక్ చేశాక కార్డు పాత ట్రన్సాక్షన్లను ఒకసారి పరిశీలించండి. ఆ తర్వాత పాత కార్డును శాశ్వతంగా బ్లాక్ చేయండి. అనంతరం కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి. మీ కార్డు మిస్సయినన్పుడు ఈ పనులన్నీ చేయడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.