Jio Recharge Plan: కేవలం రూ.51కే అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్.. జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్కుంటే..

రిలయన్స్ జియో మరో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.51తో 5జీ అన్ లిమిటెడ్ డేటా పొందవచ్చు. అయితే ప్రస్తుతం మీరు రోజుకు 1.5 జీబీ డేటా, ఒక నెల పాటు వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్ ఉపయోగిస్తుంటే. ఈ కొత్త ప్లాన్ వర్తిస్తుంది.

Jio Recharge Plan: కేవలం రూ.51కే అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్.. జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్  చేస్కుంటే..
Jio 5g

Updated on: Sep 18, 2026 | 1:02 PM

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్. రిలయన్స్ జియో మరో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇటీవల తమ కస్టమర్ల కోసం అనేక చౌకైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు మరో స్టన్నింగ్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ.51తో అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 5జీ వినియోగదారులకు ఇది అపరిమితి డేటాను అందిస్తోంది. మీరు 4జీ నెట్ వర్క్ వాడుతుంటే ఈ ప్లాన్‌తో 5జీ సేవలు పొందవచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రూ.51కే 5జీ ప్లాన్

జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.51తో 5జీ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో తక్కువ ధరకే 5జీ నెట్ వర్క్ కవరేజీ పొందవచ్చు. అంతేకాకుండా అన్ లిమిటెడ్ డేటా పొందవచ్చు. ఎలాంటి పరిమితులు లేకుండా అపరిమితి డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్ అవ్వవచ్చు. మీ ఫోన్‌కు 5జీ సపోర్ట్ ఉంటే అన్ లిమిటెడ్ డేటా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. అయితే ఇప్పటికే మీ ఫోన్‌లో రోజుకు 1.5జీబీ డేటా, ఒక నెల వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్ కలిగి ఉండాలి. అనంతరం రూ.51తో రీఛార్జ్ చేసుకుంటే.. మీ ప్రస్తుత ప్లాన్ కాలపరిమితి వరకు ఈ ప్లాన్ కూడా కూడా వర్తిస్తుంది. మీ ఫోన్ 5జీ నెట్ వర్క్ పరిధిలో ఉంటే ఇవి పనిచేస్తుంది. ఒకవేళ మీరు 4జీ సపోర్ట్ ఫోన్ వినియోగిస్తుంటే.. 3జీబీ డేటా ఉపయోగించాక స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

వ్యాలిడిటీ ఎన్ని రోజులంటే..?

మీ ప్రస్తుత ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీ ఉందనుకుందాం. అప్పుడు రూ.51 రోజుల ప్లాన్ కూడా అన్ని రోజుల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. మీ నెంబర్‌పై 56 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. 5జీ సేవలను వినియోగించాలనుకునేవారికి ఇది మంచి ప్లాన్‌గా చెప్పవచ్చు. మై జియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా రిటైలర్‌ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక మీ ప్రాంతంలో 5జీ నెట్ వర్క్ ఉందా.. లేదా అనేది మై జియో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. జియో ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్ వర్క్ సంస్థగా కొనసాగుతోంది. సబ్‌స్కైబర్లను పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు అనేక ఆఫర్లను ప్రవేశపెడుతోంది. సరసమైన ధరలకే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. ఇక మొబైల్ నెట్‌వర్క్‌లోనే కాకుండా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ జీయో సత్తా చాటుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us