Insurance Rules: ఒక్కోసారి బీమా కంపెనీలు ఎవరిదైనా ఇన్సూరెన్స్ అప్లికేషన్‌ని తిరస్కరించవచ్చు.. ఎందుకు అలా అనేది తెలుసుకోండి!

|

Sep 30, 2021 | 4:47 PM

చాలా సందర్భాలలో, బీమాను కొనుగోలు చేసేటప్పుడు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. బీమా దరఖాస్తు ఎందుకు తిరస్కరిస్తారు అనేది తెలుసుకుందాం.

Insurance Rules: ఒక్కోసారి బీమా కంపెనీలు ఎవరిదైనా ఇన్సూరెన్స్ అప్లికేషన్‌ని తిరస్కరించవచ్చు.. ఎందుకు అలా అనేది తెలుసుకోండి!
Insrurance Application Rejected
Follow us on

Insurance Rules: టర్మ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ప్లాన్ కింద బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు, నామినీకి ఆ బీమా మొత్తం లభిస్తుంది. ఇది కాకుండా, ఈ బీమా నుండి ఇతర పెద్ద ప్రయోజనాలు ఏవీ లేవు. వాస్తవానికి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత, మీరు మీ కుటుంబం గురించి తక్కువ ఆందోళన చెందుతారు. దీనితో పాటు, నామినీకి పూర్తి ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. పాలసీదారు అకాల మరణం తరువాత, బీమా కంపెనీ మొత్తం బీమా మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. నామినీ ఈ డబ్బును సరిగ్గా పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అన్ని సందర్భాలలోనూ అంత సులభం కాదు. వాస్తవానికి, చాలా సందర్భాలలో, బీమాను కొనుగోలు చేసేటప్పుడు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీ దరఖాస్తు తిరస్కరించబడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఇన్సూరెన్స్ దరఖాస్తు తిరస్కరణకు గురి అవ్వచ్చనే సంగతి చాలా మందికి తెలీదు. బీమా దరఖాస్తు ఎందుకు తిరస్కరిస్తారు అనేది తెలుసుకుందాం.

మెడికల్ చెకప్‌లో సరిపోకపోతే..

బీమా కంపెనీలు దరఖాస్తుదారుడి ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పాలసీని జారీ చేస్తాయి. చాలా సందర్భాలలో, పాలసీ కొనుగోలుదారు వైద్య పరీక్ష కూడా జరుగుతుంది. వైద్య పరీక్షలో మీ ఆరోగ్యం గురించి ప్రతికూల నివేదిక వస్తే, బీమా కంపెనీలు మీ దరఖాస్తును తిరస్కరించవచ్చు.

బీమా కంపెనీలు దరఖాస్తుదారు నుండి ఆదాయ ధృవీకరణ పత్రం కోరతాయి. వాస్తవానికి కంపెనీలు దీని ద్వారా కస్టమర్ భవిష్యత్తులో పాలసీని కొనసాగించగలరా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే.. ఎక్కువ మొత్తం బీమా చేయించుకుని.. బీమా వాయిదాలు చెల్లించడానికి కావలసిన ఆదాయ వనరులు లేకపోతే బీమా పాలసీ మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు..ఒక దరఖాస్తుదారు రూ. 3 కోట్ల బీమా కవర్ కోసం దరఖాస్తు చేసుకున్నారనుకుందాం. అతను ప్రతి నెల ప్రీమియం చెల్లించే విధానం ఎంచుకున్నాడని అనుకుందాం. ఆ దరఖాస్తుదారునికి సరైన నెలసరి ఆదాయం లేకపోతే.. ప్రీమియం చెల్లించలేరు. అందుకే.. బీమా ప్రీమియం చెల్లించడానికి ఇబ్బందులు లేని ఆదాయం దరఖాస్తు చేసేవారికి ఉందా లేదా అనేది బీమా కంపెనీలు పరిశీలిస్తాయి. ఒకవేళ ఆదాయం సరిపోదని భావిస్తే అతని దరఖాస్తు తిరస్కరించడం జరుగుతుంది

అలాగే, అధిక ప్రమాదం ప్రొఫెషన్ లో ఉన్నవారికి.. అంటే ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవారికి బీమా పాలసీని జారీ చేయడం చాలా కష్టం. కంపెనీలు దరఖాస్తుదారు నుండి గత దరఖాస్తుల గురించి సమాచారాన్ని కూడా పొందుతాయి. మీ దరఖాస్తును ఏదైనా కంపెనీ తిరస్కరించినట్లయితే, కొత్త బీమా కంపెనీ మీ దరఖాస్తును చాలా జాగ్రత్తగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే, కొంత సందేహం ఉంటే, దరఖాస్తు కూడా తిరస్కరించే అవకాశం ఉంది.

Also Read: Brain Eating Amoeba: అగ్రరాజ్యంలో మళ్ళీ మెదడు తినే అమీబా వెలుగులోకి.. చికిత్స పొందుతూ మృతి..

American Hospital: ఆస్పత్రిలో ఏడ్చిన యువతి.. సర్జరీ బిల్లుతో పాటు ‘ఎమోషనల్ బిల్లు’ వేసిన సిబ్బంది