ఇండిగో “వాలెంటైన్‌ డే” బంపర్ ఆఫర్.. కేవలం రూ.999/- కే..

| Edited By:

Feb 12, 2020 | 12:45 AM

ప్రేమికుల దినోత్సవం వస్తుందంటే చాలు.. స్పెషల్ ఆఫర్లతో ప్రేమ జంటలను ఆకర్షించేందుకు రెడీ అవుతాయి. రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, పబ్బులు, వాలెంటైన్స్ డే సందర్భంగా.. ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. వాలెంటైన్ సేల్ పేరుతో.. ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు.. రూ.999 ధరకే విమాన టికెట్లను విక్రయిస్తోంది. అన్ని టాక్స్‌లను కలిపి రూ.999/-కే విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ […]

ఇండిగో వాలెంటైన్‌ డే బంపర్ ఆఫర్.. కేవలం రూ.999/- కే..
Follow us on

ప్రేమికుల దినోత్సవం వస్తుందంటే చాలు.. స్పెషల్ ఆఫర్లతో ప్రేమ జంటలను ఆకర్షించేందుకు రెడీ అవుతాయి. రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, పబ్బులు, వాలెంటైన్స్ డే సందర్భంగా.. ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. వాలెంటైన్ సేల్ పేరుతో.. ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు.. రూ.999 ధరకే విమాన టికెట్లను విక్రయిస్తోంది. అన్ని టాక్స్‌లను కలిపి రూ.999/-కే విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ ఆఫర్‌ కింద.. మొత్తం పది లక్షల సీట్లను ఇండిగో కేటాయించింది. ఈ టికెట్ల సేల్.. ఫిబ్రవరి 14తో ముగియనుంది.

ఈ వాలెంటైన్స్ స్పెషల్ ఆఫర్ కింద టికెట్స్ బుక్ చేసుకున్న వారు.. మార్చి 1వ తేదీ నుంచి.. సెప్టెంబర్ 30 మధ్య దేశంలో ఒక నగరం నుంచి మరో నగరానికి ఒక సారి ప్రయాణించవచ్చు. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఆఫర్ తీసుకురావడంతో.. ప్రేమికుల రోజు సంబరాలను మేము ముందుగానే ప్రారంభించామని… ఇండిగో సంస్థ చీఫ్‌ కమర్షియల్ ఆఫీసర్‌ విలియమ్‌ బౌల్టర్‌ అన్నారు. కార్పొరేట్ కస్టమర్లతో పాటుగా.. విహారయాత్రలకు వెళ్లే ప్రయాణికులు ఎవరైనా ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.