
ట్రైన్ల ద్వారా ఎలక్ట్రానిక్, బైక్‌లు, కొన్ని వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పార్శిల్ చేయవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. ఎక్కువమంది బైక్‌లను ట్రైన్లో పార్శిల్ చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. సులువుగా రైళ్ల తర్వాత బైక్‌లను పంపవచ్చు. అంతేకాకుండా ఛార్జీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ పార్శిల్ ఏజెన్సీల ద్వారా పంపించాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. అదే రైళ్ల ద్వారా సురక్షితంగా, తక్కువ ఖర్చులో పంపించవచ్చు. గతంలో కేవలం పార్శిల్ కార్యాలయానికి వెళ్లి మాత్రమే బుకింగ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్ లైన్ విధానం కూడా అమల్లోకి వచ్చింది. ఆన్‌లైన్ ద్వారానే బైక్‌ను పార్శిల్ చేసేందుకు బుకింగ్ చేసుకోవచ్చు. దేశంలోని ఏ ప్రాంతానికి అయినా రైళ్ల ద్వారా బైక్‌లను ఆన్‌లైన్‌లో పార్శిల్ బుకింగ్ చేసి పంపించవచ్చు. గతంలో కేవలం ఆఫ్‌లైన్ బుకింగ్ మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం కూడా రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖాళీ ఉంటే ప్యాసింజర్ ప్రయాణించే రైల్లో కూడా బైక్‌ను పంపించే అవకాశముంది. రూటును బట్టి అత్యంత వేగంగా పంపించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాల చేస్తోంది.
-https://parcel.indianrail.gov.in/ పోర్టల్ తెరవాలి
-హోం పేజీలో పార్శిల్ సర్వీస్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి
– Sign Upపై క్లిక్ చేసి వివరాలను ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
-ఆ తర్వాత ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి
-ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్‌కు పంపాలనే వివరాలు నమోదు చేయాలి
-అనంతరం ఛార్జీల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి
-ఆ తర్వాత ఫార్వార్డింగ్ నోట్ జనరేట్ అవుతుంది. దీనిని ప్రింట్ తీసుకోవాలి
-స్టేషన్‌కు వెళ్లి బైక్, ఫార్వార్డింగ్ నోట్ అందించాలి
-ఛార్జీలు చెల్లించి రసీదు తీసుకోవాలి
-రైల్వే సిబ్బంది ఇచ్చే నెంబర్ ద్వారా మీపార్శిల్ ఎక్కడ ఉందనేది ట్రాకింగ్ చేయవచ్చు
ముందుగా సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడి పార్శిల్ కార్యాలయాన్ని సంప్రదించి పార్శిల్ బుకింగ్ ఫారం తీసుకోవాలి. ఆధార్ కార్డు, బైక్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి వివరాలు నమోదు చయాలి. ఈ తర్వాత బైక్ బరువు, పార్శిల్ పంపే దూరాన్ని బట్టి ఛార్జీలు నిర్ణయిస్తారు. ఆ ఛార్జీలను చెల్లిస్త రిసిస్ట్ అందిస్తారు. ఆ తర్వాత బైక్ దెబ్బతినకుండా పార్శిల్ చేసేందుకు అదనంగా కొంత చెల్లించాల్సి ఉంటుంది. బైక్ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత రిసిస్ట్ అందిస్తే మీ బైక్ అప్పగిస్తారు.