Flipkart Freedom Sale: ఐఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో వీటిపై బంపర్ ఆఫర్స్..

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో అదిరే ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ప్రో మాక్స్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ డీల్స్, తక్షణ క్యాష్‌బ్యాక్ ద్వారా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఆఫర్ల గురించి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Flipkart Freedom Sale: ఐఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో వీటిపై బంపర్ ఆఫర్స్..
Big Offers In Flipkart Freedom Sale

Updated on: Jul 28, 2025 | 10:19 PM

ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు ప్రత్యేక సేల్‌ను తీసుకొచ్చాయి. అమెజాన్ సేల్ అగస్టు 1నుంచి ప్రారంభం కానుండగా.. ఫ్లిప్ కార్ట్ సేల్ అగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. మీరు ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఇదొక గొప్ప అవకాశం. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో బంపర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్ మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ప్లస్, వీఐపీ యూజర్లకు ఒకరోజు ముందుగానే అంటే అగస్టు 1నుంచే యాక్సెస్ లభిస్తుంది.

ఐఫోన్స్‌పై బంపర్ డిస్కౌంట్

ఈసారి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మాక్స్ వంటి మోడళ్లపై గొప్ప ఆఫర్‌లు అందుబాటులో ఉండబోతున్నాయి. నివేదికల ప్రకారం.. ఐఫోన్ 16 (128GB) ధర రూ. 79,900 నుండి దాదాపు రూ. 59,999 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. రూ.1,29,900 ధరకు లభించే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ.1,09,999 కే అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మీరు పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే దానిపై కూడా రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్‌లు – అదనపు డిస్కౌంట్లు

యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ కార్డులతో చెల్లింపుపై 15 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. సూపర్‌కాయిన్‌లతో అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

సేల్‌లో ఏమి అందుబాటులో ఉంటుంది?
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ మాత్రమే కాకుండా, శామ్‌సంగ్ గెలాక్సీ S24, నథింగ్ ఫోన్ 3a, వన్ ప్లస్12 , వివో, రియల్ మీ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

సేల్ ప్రారంభమైన వెంటనే డీల్‌లు త్వరగా ముగియవచ్చు. కాబట్టి ముందస్తు యాక్సెస్‌ పొందేలా చూడండి. ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే షాపింగ్ చేయడం. అనవసర లింక్‌పై క్లిక్ చేసి మోసపోకుండా అప్రమత్తంగా వ్వవహరించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..