గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా క్షణాల్లో మనీ ట్రాన్స్‌ఫర్.. ఇలా చేస్తే చాలు..

అత్యవసరంగా ఒకరికి డబ్బులు పంపాలి.. కానీ మొబైల్‌లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది.. లేదా మీరున్న చోట అస్సలు సిగ్నల్ లేదా.. ఇలాంటి సిట్యుయేషన్ మీకూ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది కదా? అయితే ఇకపై ఇంటర్నెట్ లేకపోయినా ఒక్క నిమిషంలో UPI ద్వారా డబ్బులు పంపవచ్చని మీకు తెలుసా?

గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా క్షణాల్లో మనీ ట్రాన్స్‌ఫర్.. ఇలా చేస్తే చాలు..
How To Use Upi Without Internet

Updated on: Jun 07, 2026 | 12:45 PM

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో యూపీఐ ఒక భాగమైపోయింది. కిరాణా కొట్టులో రూపాయి చాక్లెట్ కొనడం దగ్గరి నుండి.. షోరూమ్‌లో కార్లు, బంగారం లాంటి ఖరీదైన వస్తువులు కొనేంత వరకు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా ప్రతిరోజూ కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే అత్యవసర సమయంలో ఇంటర్నెట్ సర్వీస్ ఆగిపోయినా లేదా నెట్‌వర్క్ సమస్యలు వచ్చినా యూజర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. సరిగ్గా ఇలాంటి సమస్యల కోసమే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్ లేకుండానే డబ్బు పంపే అద్భుతమైన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ లేకపోయినా సులభంగా డబ్బు ఎలా పంపాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఇంటర్నెట్ లేకుండా UPI వాడాలంటే ఏం కావాలి?

ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేని గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ లేదా పర్వత ప్రాంతాల ప్రజల కోసం ఎన్‌పీసీఐ ఈ కీలకమైన సేవను డిజైన్ చేసింది. అయితే, ఈ సేవను ఉపయోగించే ముందు మీ మొబైల్‌లో ఈ విషయాలు సరిచూసుకోవాలి.

  • మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి.
  • మీరు గతంలోనే మీ నంబర్‌పై UPI సేవను ఆక్టివేట్ చేసి ఉండాలి.
  • డేటా లేకపోయినా పర్వాలేదు కానీ, మొబైల్ సిగ్నల్ (నెట్‌వర్క్) ఉండాలి.
  • మీ మొబైల్‌లో నార్మల్ కాల్స్, SMS సౌకర్యం పనిచేస్తూ ఉండాలి.

నెట్ లేకుండా డబ్బు పంపే ప్రాసెస్..

ఒకవేళ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే, మీ సాధారణ మొబైల్ కీప్యాడ్ ద్వారానే కింది విధంగా సింపుల్‌గా మనీ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు..

స్టెప్ 1 : మొదట మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుండి 99# కు డయల్ చేయండి. ఈ సేవ భారతదేశంలోని దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులకు వర్తిస్తుంది. డయల్ చేయగానే మీ మొబైల్ స్క్రీన్‌పై UPI సేవలకు సంబంధించిన ఒక పాప్ అప్ మెనూ కనిపిస్తుంది.

స్టెప్ 2 : మీ స్క్రీన్‌పై.. డబ్బు పంపండి, డబ్బు అభ్యర్థన, బ్యాలెన్స్ చెక్, మై ప్రొఫైల్ వంటి పలు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో డబ్బు పంపండి ఆప్షన్‌కు ఎదురుగా ఉన్న నంబర్‌ను టైప్ చేసి సబ్మిట్ చేయండి.

స్టెప్ 3 : ఇప్పుడు డబ్బు పంపడానికి మీకు UPI ID, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్ వంటి ఆప్షన్లు వస్తాయి. అందులో మీకు నచ్చిన ఒక ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4 : మీరు ఎవరికైతే డబ్బు పంపాలనుకుంటున్నారో.. వారి సరైన వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న అమౌంట్‌ను నమోదు చేయండి.

స్టెప్ 5: చివరగా మీ సీక్రెట్ UPI పిన్ నంబర్‌ను ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. అంతే క్షణాల్లో మీ డబ్బు అవతలి వ్యక్తికి చేరుకుంటుంది. సక్సెస్ అయినట్లు స్క్రీన్‌పై మెసేజ్ రావడంతో పాటు మీ మొబైల్‌కు సాధారణ SMS కూడా వస్తుంది.

యూజర్లు గమనించవలసిన ముఖ్యమైన విషయాలు..

టెలికాం ఛార్జీలు: ఈ ఆఫ్‌లైన్ సేవను ఉపయోగించినందుకు కొన్ని టెలికాం కంపెనీలు సాధారణ SMS లేదా కాల్ రుసుములను వసూలు చేసే అవకాశం ఉంది.

జాగ్రత్త అవసరం: ఇంటర్నెట్ యాప్‌ల లాగా ఇందులో అవతలి వ్యక్తి పేరు ముందుగా డిస్‌ప్లే అవ్వకపోవచ్చు. కాబట్టి తప్పుడు వివరాలు అందిస్తే డబ్బు వేరే ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. నంబర్లు ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

గోప్యత: యాప్‌లలో లాగానే ఈ విధానంలో కూడా మీ యూపీఐ పిన్ వివరాలను ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచడం చాలా ముఖ్యం.

Follow Us