Gold Price Today: వారం రోజుల్లో భారీగా తగ్గిన బంగారం.. తాజాగా తులం ధర ఎంతంటే..!

Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగినప్పటికీ, గత వారం రోజుల నుంచి ధరలను పరిశీలిస్తే భారీగానే తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు..

Gold Price Today: వారం రోజుల్లో భారీగా తగ్గిన బంగారం.. తాజాగా తులం ధర ఎంతంటే..!
Today Gold Price

Updated on: Sep 27, 2026 | 6:42 AM

Gold, Silver Prices Today: నిన్న బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధరలు స్వల్పంగా రూ.200 పెరిగి రూ.1,52,680 కు చేరాయి. దీంతో వరుసగా నాలుగు సెషన్ల నష్టాల పరంపరకు తెరపడింది. వారం రోజుల తర్వాత తగ్గుతున్న ముడిచమురు ధరలు, బలహీనపడుతున్న డాలర్ పెట్టుబడిదారులకు కొంత ఉపశమనం కలిగించాయి. అలాగే వారం రోజుల్లో వెండి ధర రూ. 10,000 మేర తగ్గుముఖం పట్టింది. బంగారం మాత్రం వారం రోజుల్లో రూ.4 వేల వరకు తగ్గింది.

ఇక తాజాగా సెప్టెంబర్‌ 27న దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,010 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,730 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.
  7. కిలోగ్రాము వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.

గురువారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,400 వద్ద ముగిసిందని బులియన్ వ్యాపారులు తెలిపారు. స్థానిక వ్యాపారుల ప్రకారం, వెండి ధరలు కిలోగ్రాముకు రూ. 2.37 లక్షల వద్ద స్థిరంగా ఉన్నాయి. పెట్టుబడిదారులు తక్కువ స్థాయిలలో కొనుగోలు చేయడంతో, వరుసగా నాలుగు సెషన్ల క్షీణత తర్వాత బంగారం ధరలు మెరుగుపడ్డాయని వ్యాపారులు తెలిపారు. అయితే, ఈ వారంలో బంగారం ధరలు రూ. 4,000 వరకు తగ్గగా, వెండి ధరలు రూ. 10,000 తగ్గింది.

విలువైన లోహానికి ఉన్న కొన్ని కీలక సవాళ్లు సడలడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా మెరుగుపడ్డాయి. ముడి చమురు ధరలు, అమెరికన్ డాలర్ ఇటీవలి గరిష్టాల నుంచి పడిపోయాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ అన్నారు. ఈ మెరుగుదల ఉన్నప్పటికీ, వారం ప్రారంభంలో డాలర్ విలువలో వచ్చిన భారీ పెరుగుదల కారణంగా వారంవారీగా బంగారం ధరలు తగ్గాయని గాంధీ తెలిపారు.

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగినప్పటికీ, గత వారం రోజుల నుంచి ధరలను పరిశీలిస్తే భారీగానే తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఇది కూడా చదవండి: Banks Strike: బ్యాంక్ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకులు బంద్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us