త్వరపడండి.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

| Edited By:

Jan 10, 2020 | 1:26 AM

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌. గతకొద్ది రోజులుగా అంబరాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు.. మళ్లీ నేలవైపు దిగొస్తున్నాయి. రూ. 41 వేలకు పైగా ఉన్న బంగారం ధరకు గురువారం బ్రేకులు పడ్డాయి. రూ.766 తగ్గడంతో రూ. 41వేల మార్క్‌ దిగువకు చేరింది. బులియన్‌ మర్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.40,634కి చేరింది. ఓ వైపు రూపాయి విలువ బలపడటంతో పాటు.. మరోవైపు అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇక వెండి […]

త్వరపడండి.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Follow us on

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌. గతకొద్ది రోజులుగా అంబరాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు.. మళ్లీ నేలవైపు దిగొస్తున్నాయి. రూ. 41 వేలకు పైగా ఉన్న బంగారం ధరకు గురువారం బ్రేకులు పడ్డాయి. రూ.766 తగ్గడంతో రూ. 41వేల మార్క్‌ దిగువకు చేరింది. బులియన్‌ మర్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.40,634కి చేరింది. ఓ వైపు రూపాయి విలువ బలపడటంతో పాటు.. మరోవైపు అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు.

ఇక వెండి ధర కూడా దిగొస్తోంది. యాభై వేల రూపాయలకు పైగా వెళ్తున్న ధరలకు గురువారం బ్రేకులు పడ్డాయి. కిలో వెండిపై రూ.1,148 తగ్గి.. రూ.47,932 చేరింది. అంతకు ముందు కిలో వెండి ధర రూ.49,080గా ఉంది. దేశీయంగానే కాకుండా.. అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఔన్సు బంగారం ధర 1,546 డాలర్లు ఉండగా, వెండి 17.93 డాలర్లు ఉంది. అయితే రాబోయేది పెళ్లిళ్ల సీజన్‌ కాబట్టి.. దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయంటున్నారు మార్కెట్ నిపుణులు. సో.. పసిడి ప్రియులు కొనాలనుకుంటే ఇదే రైట్ టైమ్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.