Gold Rates Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం.. అందుకోవడం కష్టమే

| Edited By:

Aug 26, 2019 | 8:02 AM

పసిడి పరుగులు ఆగడం లేదు. హైదరాబాద్‌ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.670 పెరిగి రూ.40,150కు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.590 పెరుగుదలతో రూ.36,800కు చేరింది. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండిధర కూడా […]

Gold Rates Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం.. అందుకోవడం కష్టమే
Follow us on

పసిడి పరుగులు ఆగడం లేదు. హైదరాబాద్‌ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.670 పెరిగి రూ.40,150కు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.590 పెరుగుదలతో రూ.36,800కు చేరింది. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు వెండిధర కూడా స్వల్పంగా పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.45 పెరుగుదలతో రూ.47,845కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.