Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ప్రస్తుత ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అయితే ఈ ధరలు ప్రాంతాలను బట్టి ధరల్లో తేడా ఉండవచ్చు..
తాజాగా శుక్రవారం 11గంటల సమయానికి ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై ఏకంగా రూ.3,220 వరకు పెరుగగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2,950 వరకు ఎగబాకింది. అదే వెండిపై ఏకంగా 5000 రూపాయల వరకు పెరిగింది.
Gold, Silver Prices: మహిళలకు అదిరిపోయే శుభవార్త ఉంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు గత రెండు రోజులుగా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజుల్లో తులం బంగారంపై ఏకంగా 4 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అలాగే వెండిపై 15 వేల రూపాయల వరకు తగ్గింది. తాజాగా జూన్ 7వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,730 వరకు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,000 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర 1,65,000 వద్ద కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజు బంగారం ధర 3 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. అదే వెండి 10 వేల రూపాయల వరకు తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్, విజయవాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,730 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,910 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,730 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,730 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,910 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,000 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్, విజయవాడ, కేరళ, చెన్నైలలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో ఇంకా తక్కువగా ఉంది. ఇక్కడ రూ.2,65,000 వద్ద ట్రేడవుతోంది.
ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అయితే ఈ ధరలు ప్రాంతాలను బట్టి ధరల్లో తేడా ఉండవచ్చు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో జీఎస్టీ, ఇతర ట్యాక్స్‌లు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఎక్కువ.. తక్కువగా ఉండవచ్చు. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు మీమీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో ముందస్తుగా తెలుసుకుని వెళ్లడం మంచిది.