Gold Price Today: దిగి వస్తున్న బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..

Gold Price Today: గత రెండు రోజుల క్రితం ఒక్కసారిగా 2 వేల రూపాయలకుపైగా ఎగబాకింది. ఇదిలా ఉంటే నిన్న తులం బంగారంపై 800 రూపాయల వరకు తగ్గింది. ఇక నిన్నటికి ఈ రోజు ఉదయం అంటే నవంబర్‌ 15వరకు తులం బంగారం..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..

Updated on: Nov 15, 2025 | 6:28 AM

దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.ఈ మధ్య కాలంలో పసిడి ధర ఆల్ టైమ్ గరిష్టాల నుంచి 10-15 రోజుల పాటు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక దశలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,380 డాలర్లపైన గరిష్ట స్థాయికి చేరగా.. మళ్లీ 400 డాలర్లకుపైగా తగ్గి 4 వేల డాలర్ల స్థాయి దిగువకు కూడా చేరింది. కానీ గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుముఖం పడుతుండగా, గత రెండు రోజుల క్రితం ఒక్కసారిగా 2 వేల రూపాయలకుపైగా ఎగబాకింది.

ఇదిలా ఉంటే నిన్న తులం బంగారంపై 800 రూపాయల వరకు తగ్గింది. ఇక నిన్నటికి ఈ రోజు ఉదయం అంటే నవంబర్‌ 15వరకు తులం బంగారం ధరపై రూ.1500 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,030 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.1,73,200 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,180 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,16,590 ఉంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,16,440 ఉంది.
  3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,16,440 ఉంది.
  4. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,16,440 ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,060 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,390 ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,16,440 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us