Gold Price Today: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

భారతీయులకు బంగారం అంటే కేవలం అభరణాలు మాత్రమే కాదు వారి సంప్రదాయంలో ఒక భాగం. పండగొచ్చినా, శుభకార్యం వచ్చినా బంగారం కొనాల్సిందే. ఇక ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎంత ఉన్నాయంటే..?

Gold Price Today: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?
Gold Price Today

Updated on: Oct 30, 2025 | 7:05 AM

పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఒక్కరోజే రూ.1500 తగ్గి మహిళలకు ఊరటనిచ్చిన గోల్డ్ ధరలు.. నిన్న మళ్లీ పెరిగింది. ఇక ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,560గా ఉంది. నిన్న ఇది రూ.1,22,550గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,12,360 ఉండగా.. నిన్న రూ.1,12,350 గా ఉంది. అంటే నిన్నటికి, ఇవాళ్టికి స్వల్పంగా రూ.10 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు చూసుకంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,222,410గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,22,400గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,12,210 ఉండగా.. నిన్న రూ.1,12,200గా ఉంది. అంటే నిన్నటికి ఇవాళ్టికి బంగారం ధరలు రూ.10 రూపాయలు పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.91,810గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెంట్ల 10 తులాల బంగారం రూ.1,22,410గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,22,400గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,210గా ఉండగా.. నిన్న 1,12,200గా ఉంది. ఇక మన పక్క రాష్ట్రం తమిళనాడులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,23,560గా ఉంది. అదేవిధంగా బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,410గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,210గా ఉంది.

వెండి ధరలు

ఇక వెండి ధరల విషయానికొస్తే హైదరాబాద్‌లో తులం వెండి రూ.1661గా ఉంది. ఇక కిలో వెండి రూ.1,66,100గా ఉంది. నిన్నటికి, ఇవాళ్టికి వెండి ధర కిలోపై రూ.100 పెరిగింది. ఇక విజయవాడలో 10 గ్రాముల వెండి రూ.1661గా ఉండగా.. కిలో వెండి రూ.1,66,100గా ఉంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో తులం వెండి రూ.1521గా ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి