Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కొన్ని రోజుల క్రితంతో పోలిస్తే బంగారం ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి.. ఇటీవల లక్ష మార్క్ దాటి పరుగులు పెట్టిన పసిడి ధర వెనక్కి తగ్గుతూ వస్తోంది.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం.. డిమాండ్ తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
Gold Price: బంగారం ధరలు ఈరోజు రికార్డు స్థాయికి పెరిగాయి మరియు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో, MCXలో బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

Updated on: Jun 30, 2025 | 10:57 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కొన్ని రోజుల క్రితంతో పోలిస్తే బంగారం ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి.. ఇటీవల లక్ష మార్క్ దాటి పరుగులు పెట్టిన పసిడి ధర వెనక్కి తగ్గుతూ వస్తోంది.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం.. డిమాండ్ తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. కొన్ని రోజులక్రితం లక్షా రెండు వేలకు పైగా పెరిగిన తులం బంగారం ధర.. ఇప్పడు 97 వేలకు తగ్గింది.. అంటే దాదాపు రూ.5వేల వరకు ధర తగ్గింది. అయితే.. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.. అయితే.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. జూన్ 30 2025 సోమవారం ఉదయం పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 97,260 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,150 గా ఉంది. 10 గ్రాముల బంగారం పై రూ.160 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ. 100 తగ్గి.. రూ.1,07,700లుగా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,260 ఉంటే.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,150 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,17,700లుగా ఉంది.
  2. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,260, 22 క్యారెట్ల ధర రూ.89,150లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,17,700 లుగా ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,410, 22 క్యారెట్ల ధర రూ.89,300 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,07,700 లుగా ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,260, 22 క్యారెట్ల ధర రూ.89,150 ఉంది. వెండి ధర కిలో రూ.1,07,700 గా ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.97,260 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,150 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,17,700 లుగా ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.97,260, 22 క్యారెట్ల ధర రూ.89,150 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,07,700 లుగా ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us