బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి నష్టం జరిగిందా..? పరిహారం ఎంతంటే.. ఈ రూల్స్ తెలుసుకోండి..

బంగార తాకట్టు పెట్టి లోన్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరూ RBI నియమాలు తెలుసుకోవాలి. లోన్ పరిమితులు, నగల భద్రత, వేలం ప్రక్రియపై స్పష్టమైన నియమాలు ఉన్నాయి. రుణగ్రహీతలు తమ హక్కులు తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు తాకట్టు పెట్టిన బంగారానికి నష్టం జరిగితే పరిహారం పొందవచ్చు.

బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి నష్టం జరిగిందా..? పరిహారం ఎంతంటే.. ఈ రూల్స్ తెలుసుకోండి..
Gold Loan Rules

Updated on: Nov 14, 2026 | 9:10 PM

అత్యవసర పరిస్థితుల్లో చాలామంది తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటూ ఉంటారు. గోల్డ్ లోన్లకు సంబంధించి బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు(NBFCలు) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టమైన నియమాలు విధించింది. ఎంతవరకు గోల్డ్ లోన్ ఇవ్వాలనే విషయంతో పాటు వడ్డీ రేట్లు, లోన్ రికవరీ నియమాలు, పరిహారం వంటి నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలను తెలుసుకోవడం వల్ల రుణగ్రహీతలు తమ హక్కులను పరిరక్షించడంలో సహాయపడుతుంది. ఇటీవల గోల్డ్ లోన్లు ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి హక్కులు ఉంటాయి..? మీ బంగారానికి నష్టం జరిగితే బ్యాంకులు పరిహారం అందిస్తాయా..? వంటి విషయాలు తెలుసుకుందాం.

బంగారానికి నష్టం జరిగితే పరిహారం ఎంత..?

రుణ గ్రహీతలు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకులు తన బ్రాంచ్‌లోనే ఉంచాలి. తన ఉద్యోగుల పర్యవేక్షణలో సరిపోయే సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లో ఉంచాల్సి ఉంటుంది. అలాంటి వాల్ట్ లేని బ్రాంచులు సాధారణంగా ఈ లోన్లు ఇవ్వకూడదని ఆర్బీఐ రూల్స్ ప్రవేశపెట్టింది. ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి తాకట్టు పెట్టిన నగలు పోయినా, పాడైనా, బరువు లేదా ప్యూరిటీ తగ్గినా, పూర్తిగా కనిపించకపోయినా బ్యాంకు నుంచి పరిహారం పొందవచ్చు. బంగారం విలువతో పాటు మేకింగ్ ఛార్జీలు, రాళ్ల విలువను కూడా పరిహారంలో భాగంగా చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. మీ బంగారం విలువ, జరిగిన నష్టం ఆధారంగా పరిహారం  ఉంటుంది. అలాగే లాకర్లలోని వస్తువులకు పరిహారానికి సంబంధించి పరిమితులు ఉండగా.. తాకట్టు పెట్టిన నగలకు అలాంటి పరిమితి ఏమీ ఉండదు. బ్యాంకు అందించిన పరిహారం సరిపోకపోతే మీరు RBI ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మన్ లేదా కన్స్యూమర్ కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

ఏడు రోజుల్లోగా తిరిగి ఇచ్చేయాల్సిందే..?

అలాగే లోన్ చెల్లించిన వెంటనే ఏడు వర్కింగ్ రోజుల్లోపు బ్యాంకు రుణ గ్రహీతకు నగలను తిరిగి ఇవ్వాలి. ఆలస్యం చేస్తే ఏడు రోజుల తర్వాత ప్రతి రోజుకు రూ.5 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. ఇక బంగారం లాకర్లలో దాచుకున్న సమయంలో ఒకవేళ ఆ బంగారం పోయినా లేదా ఏదైనా నష్టం జరిగినా బ్యాంక్ నుంచి పరిహారం అందుతుంది. అయితే గోల్డ్ లోన్ చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వకపోతే మీ బంగారు రుణ రసీదు, రుణ ఒప్పందం, మీ ఆభరణాల ఫోటోతో పాటు వాటి బరువు, స్వచ్ఛతను వివరించే ధృవీకరణ పత్రాన్ని భద్రపరచుకోండి. మీరు ఆ ఆధారంగా ఆర్బీఐకు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో ఆర్బీఐ మీకు నష్టపరిహారం, మీ గోల్డ్ తిరిగి వచ్చేలా బ్యాంక్‌కు ఆదేశాలు జారీ చేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us