Gold Loan: గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వడం లేదా..? ఈ రూల్స్ తెలుసుకోండి..

బంగారం రుణం చెల్లించినా.. బ్యాంక్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వడం లేదా.. అయితే మీరు ఏం చేయాలి. కొన్నిసార్లు బ్యాంకులు బంగారాన్ని తమ వద్దే ఉంచుకోవచ్చు. దీంతో మీరు గోల్డో లోన్ తీసుకునేముందు నియమ, నిబంధనల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

Gold Loan: గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వడం లేదా..? ఈ రూల్స్ తెలుసుకోండి..
Gold Loan

Updated on: Sep 26, 2026 | 9:13 PM

తక్కువ వడ్డీ రేటుతో పాటు బంగారం ధరలు గత రెండేళ్ల కాలంలో పెరగడంతో ఎక్కువ లోన్ వస్తుందనే కారణంతో గోల్డ్ లోన్ ఎక్కువమంది తీసుకుంటారు. ఈ లోన్‌కు డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌ తక్కువ ఉండటంతో పాటు వేగంగా మంజూరవుతుంది. బంగారు తాకట్టు పెట్టి గంటలోనే లోన్ పొందవచ్చు. బంగారాన్ని పూచీకత్తుగా పెడతారు గనుక సులువుగా బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకండా ఈ రుణం మంజూరు చేస్తారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో నగదు అవసరమైనప్పుడు గోల్డ్ లోన్ వైపు అందరూ మొగ్గు చూపుతారు. పర్సనల్ లోన్ కంటే వీటి వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. బ్యాంక్‌ను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.

రుణం చెల్లించినా బంగారం ఇవ్వడం లేదా..?

బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించగానే బ్యాంకులు మీరు తాకట్టులో పెట్టిన బంగారాన్ని ఇచ్చేస్తాయని చాలామంది భావిస్తారు. కానీ కొన్నిసార్లు బ్యాంకులు తిరిగి ఇవ్వవు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీ బంగారాన్ని బ్యాంకులకు తమ వద్దే ఉంచుకునే హక్కు ఉంటుంది. రుణ ఒప్పందం, ఇతర బకాయిల ఆధారంగా బ్యాంకులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. రుణగ్రహీత బంగారు రుణాన్ని తిరిగి చెల్లించినా.. అతను మరో రుణానికి కూడా బాధ్యుడిగా ఉంటే బ్యాంకులు గోల్డ్ ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. సహ-దరఖాస్తుదారుగా ఉంటే బంగారాన్ని తమ వద్దే ఉంచుకుంటాయి. ప్రస్తుతం లేదా భవిష్యత్ రుణాలకు బంగారాన్ని హామీగా ఉపయోగించుకోవడానికి మీరు అంగీకరిస్తే బ్యాంకులు తిరిగి ఇచ్చేయవు. దీంతో మీరు బంగారాన్ని తాకట్టు పెట్టి రణం తీసుకునేముందు రుణ ఒప్పందంలోని పత్రాలను క్లియర్‌గా చదవాలి. సంతకం చేసే ముందు నిబంధనలు స్పష్టంగా తెలుసుకోండి.

బంగారాన్ని ఇవ్వకపోతే ఏం చేయాలి..?

మీరు రుణం చెల్లించినా బ్యాంకులు మీ బంగారాన్ని తిరిగి ఇవ్వకపోతే ముందుగా కారణం తెలుసుకోండి. రాతపూర్వకంగా కారణాన్ని బ్యాంక్ నుంచి పొందండి. రుణ బకాయి వివరాల గురించి తెలసుకోండి. బ్యాంక్ ఇచ్చిన వివరణపై మీరు సంతృప్తి చెందకపోతే బ్యాంక్ ఫిర్యాదుల విభాగాన్ని సంప్రదించండి. అప్పటికే సంతృప్తి చెందకపోతే ఆర్బీఐ ఆర్‌బిఐ ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్‌మన్ ద్వారా సాయం పొందవచ్చు. 30 రోజుల తర్వాత మీరు ఆర్బీఐ ఓంబుడ్స్‌మన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంక్ స్టేట్‌మెంట్, రుణ పత్రాలు, చెల్లింపు, తాకట్టు రసీదులు సిద్దంగా ఉంచుకోండి. ఆన్‌లైన్ ద్వారా ఆర్బీఐ ఓంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో ఆర్బీఐ స్పందించి మీకు న్యాయం జరిగేలా చేస్తుంది. మీ తప్పు లేకుండా బ్యాంక్ ఉంచుకుంటే మీకు పరిహారం కూడా అందుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us