Gold Rate: ఓర్నాయనో.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల ఆల్‌టైమ్ హైకి చేరిన పసిడి ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ లక్ష మార్క్ దాటింది. అటు వెండి కూడా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. ఇలా గోల్డ్, సిల్వర్ ధరలు నాన్‌‌స్టాప్‌గా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు..

Gold Rate: ఓర్నాయనో.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే..
Gold And Silver Price

Updated on: Jul 21, 2025 | 11:01 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల ఆల్‌టైమ్ హైకి చేరిన పసిడి ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ లక్ష మార్క్ దాటింది. అటు వెండి కూడా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. ఇలా గోల్డ్, సిల్వర్ ధరలు నాన్‌‌స్టాప్‌గా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా.. బంగారం ధర మళ్లీ పెరగగా.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. జులై 21 2025 సోమవారం ఉదయం పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,00,150 ఉంటే.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.91,800 లుగా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ. 110 మేర ధర పెరిగింది. వెండి ధర కిలో రూ.1,16,000 గా ఉంది. అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

నగరాల వారీగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,00,150 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.91,800 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,26,000 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,00,150, 22 క్యారెట్ల ధర రూ.91,800 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,26,000 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,300, 22 క్యారెట్ల ధర రూ.91,950 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,16,000 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,150, 22 క్యారెట్ల ధర రూ.91,800 ఉంది. వెండి ధర కిలో రూ.1,16,000 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,150 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.91,800 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,26,000 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,00,150, 22 క్యారెట్ల ధర రూ.91,800 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,16,000 లుగా ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us