Gold Price: తగ్గేదేలే.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు ఇవే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: పసిడి ధరలు నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తున్నాయి.. ఇటీవలి కాలంలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.. గత వారం లక్ష రూపాయలను దాటేసిన బంగారం ప్రస్తుతం 99 వేలకు దిగి వచ్చింది. ఈ క్రమంలోనే మళ్లీ బంగారం ధర పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Gold Price: తగ్గేదేలే.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు ఇవే..
Gold And Silver Price

Updated on: Jul 19, 2025 | 7:02 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: పసిడి ధరలు నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తున్నాయి.. ఇటీవలి కాలంలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.. గత వారం లక్ష రూపాయలను దాటేసిన బంగారం ప్రస్తుతం 99 వేలకు దిగి వచ్చింది. ఈ క్రమంలోనే మళ్లీ బంగారం ధర పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి బంగారానికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి..

తాజాగా.. బంగారం ధర పెరగగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. జులై 19 2025 శనివారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.99,390 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.91,110 గా ఉంది. శుక్రవారం ఉదయంతో పోల్చుకుంటే.. పది గ్రాముల బంగారంపై రూ.50 మేర ధర పెరిగింది. వెండి ధర రూ.100 తగ్గి రూ.1,13,800 లుగా ఉంది. అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,390 ఉంటే.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.91,110 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,23,800 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.99,390, 22 క్యారెట్ల ధర రూ.91,110 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,23,800 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,530, 22 క్యారెట్ల ధర రూ.91,260 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,13,800 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,390, 22 క్యారెట్ల ధర రూ.91,110 ఉంది. వెండి ధర కిలో రూ.1,13,800 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.99,390 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.91,110 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,23,800 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.99,390, 22 క్యారెట్ల ధర రూ.91,110 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,13,800 లుగా ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us