Gold Rate Today: మళ్లీ షాకిస్తున్న పసిడి ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతుందంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: అంతర్జాతీయంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే..

Gold Rate Today: మళ్లీ షాకిస్తున్న పసిడి ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతుందంటే..
Dubai Gold: బంగారం, వెండి కొనాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా దుబాయ్ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే భారతదేశంలో కంటే అక్కడ బంగారం చౌకగా ఉంటుంది. మీరు కూడా బంగారం కొనాలని ప్లాన్ చేసుకుంటే ఈ వార్త ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. జూలై 9న దుబాయ్‌లో బంగారం ఎంత రేటుకు లభిస్తుందో, భారతదేశంతో పోలిస్తే రేటులో తేడా ఏమిటో తెలుసుకుందాం.

Updated on: Jul 18, 2025 | 6:20 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: అంతర్జాతీయంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. పది గ్రాముల బంగారం ధర లక్ష మార్క్ దాటి.. ఆ తర్వాత కాస్త ఊరటనిచ్చింది.. ఈ క్రమంలోనే.. ధరలు మళ్లీ అమాంతం పెరగడంతో పసిడి ప్రియులకు షాకిచ్చినట్లయింది.. ఇక వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనిస్తున్నాయి.. ముఖ్యంగా.. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ధరల్లో పెద్దగా వ్యాత్యాసం ఉండటం లేదు.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. జులై 6 2025 ఆదివారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.98,830 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,600 లుగా ఉంది. వెండి ధర రూ.1,10,000లుగా ఉంది. అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,830 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,600 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,830, 22 క్యారెట్ల ధర రూ.90,600లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,20,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,980, 22 క్యారెట్ల ధర రూ.90,750 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,000 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,830, 22 క్యారెట్ల ధర రూ.90,600 ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,830 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,600 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,20,000 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,830, 22 క్యారెట్ల ధర రూ.90,600 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000 లుగా ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us