తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

Gold Rate Today: అక్టోబర్ 21న బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,46,070గా, 22 క్యారెట్ల ధర రూ.1,33,890గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో తాజా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
Gold Rates

Updated on: Oct 21, 2026 | 6:29 AM

బులియన్ మార్కెట్‌లో గత కొంతకాలం నుంచి ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి.. ఆ తర్వాత కాస్త తగ్గిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా.. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు.. సౌదీ-హౌతీల దాడులు.. ఇలా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మార్కెట్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా.. మంగళవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.. దాదాపు వేయి వరకు ధర తగ్గింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా బుధవారం (అక్టోబర్ 21) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. తాజాగా.. స్వల్పంగా ధరలు పెరిగాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,46,070 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 10 తగ్గి.. రూ.1,33,890 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,29,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,46,070, 22 క్యారెట్ల ధర రూ.1,33,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,48,050 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,46,070, 22 క్యారెట్ల ధర రూ.1,33,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,29,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,46,070, 22 క్యారెట్ల ధర రూ.1,33,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,29,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,47,160, 22 క్యారెట్ల ధర రూ.1,34,890 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా ధర రూ.1,46,070, 22 క్యారెట్ల ధర రూ.1,33,890 ఉంది. వెండి కిలో ధర రూ.2,29,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us