Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?

Gold, Silver Prices: బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ముడి చమురు ధరలు తగ్గడమే. ముడి చమురు ధర ఎక్కువగా ఉన్నప్పుడు, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అధికంగా ఉంచవచ్చు లేదా పెంచవచ్చు కూడా. బంగారం ఎలాంటి వడ్డీని చెల్లించదు

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
Today Gold Price

Updated on: Nov 10, 2026 | 6:32 AM

Gold, Silver Prices: బంగారం, వెండి ధరలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక్క రోజే ధరలు భారీగా పెరిగాయి. సోమవారం MCXలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1,400 పెరగగా, కిలో వెండి ధర రూ.4,000 పెరిగింది. తగ్గుతున్న ముడి చమురు ధరలు, బలహీనమైన డాలర్ కారణంగా ఈరోజు విలువైన లోహాలకు మద్దతు లభించింది.

తాజాగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,760 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,710.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,580.
  7. ఇక కిలో వెండి ధర 2,04,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

చమురు ధరల తగ్గుదల బంగారంపై ఎలా ప్రభావం చూపింది?

బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ముడి చమురు ధరలు తగ్గడమే. ముడి చమురు ధర ఎక్కువగా ఉన్నప్పుడు, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అధికంగా ఉంచవచ్చు లేదా పెంచవచ్చు కూడా. బంగారం ఎలాంటి వడ్డీని చెల్లించదు కాబట్టి, అధిక వడ్డీ రేట్లు బంగారంలో పెట్టుబడిదారుల పెట్టుబడిని తగ్గిస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us