Gold Price: హమ్మయ్య.. మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold, Silver Price Today: కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరల భారీ ఊరట కల్పించాయి. గత కొన్ని రోజులు పెరుగుతూ వస్తున్న ఈ ఆభరణాల ధరలు గురువారం నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గురువారంతో పొల్చుకుంటే శుక్రవారం కూడా ధరల్లో పెద్ద పెరుగుదల ఏమాత్రం కనిపించలేదు.. కాబట్టి ఈ రోజులు హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price: హమ్మయ్య.. మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold Price Drop

Updated on: Sep 18, 2026 | 6:28 AM

గత రెండు, మూడు రోజులగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ తగ్గుదలకు ముఖ్య కారణం యూఎస్ సెంట్రల్ బ్యాంక్ తాజాగా వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో డాలర్ విలువ బలపడి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో పాటు దేశీయంగా స్పాట్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు తగ్గడం ధరల దిద్దుబాటుకు సహాయపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కొనుగోలు దారులకు కాస్త ఊరట దొరికినట్టు అవుతుంది.

ఇక గురువారంతో పోల్చుకుంటే శక్రవారం ఉదయం 6 గంటలకు దేశీయ మార్కెట్‌లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 10 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. కూడా రూ.10 తగ్గుముఖం పట్టింది.అంటే ప్రస్తుతం సెప్టెంబర్‌ 17న ఉదయం 6 గంటలకు 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,52,830గా వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,090 వద్ద ట్రేడవుతుంది. ఇక దేశ వ్యాప్తంగా వివిద నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
  • ఢిల్లీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,980 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,240 వద్ద కొనసాగుతోంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా

ఇక వెండి విషయానికొస్తే బంగారం తగ్గితే వెండి స్వల్పంగా తగ్గుముకం పట్టింది. ప్రస్తుతం దేవీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోండగా హైదరాబాద్, చెన్న, కేరళలో మాత్రం కేజీ వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడువుంతుంది. ఇక మిగతా నగరాల్లో రూ.2,44,900గా మాత్రమే కొనసాగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us