Gold Rates: వారం రోజుల్లో బంగారం ధరలు భారీగా ఢమాల్.. ! వచ్చే వారంలో ఇంకా తగ్గుతాయా..?

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ వారం మొత్తం ధరలు భారీగా తగ్గాయి. వారం మధ్యలో కాస్త పెరిగినప్పటికీ.. చివరి నాటికి పడిపోయాయి. ఈ వారంలో బంగారం రూ.3 వేలకుపైగా తగ్గగా.. వెండి ధరలు కూడా రూ.5 వేల వరకు పడిపోయాయి.

Gold Rates: వారం రోజుల్లో బంగారం ధరలు భారీగా ఢమాల్.. ! వచ్చే వారంలో ఇంకా తగ్గుతాయా..?
జూన్ 5న అమెరికాలో స్పాట్ బంగారం 3.2 శాతం తగ్గి ఔన్సుకు $4,330.10కి పడిపోయింది. వెండి 7.1 శాతం తగ్గి ఔన్సుకు $68.63కి చేరింది. ఇక భారతదేశంలోని MCX కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ఫ్యూచర్స్, వెండి ఫ్యూచర్స్‌లో భారీ క్షీణత కనిపించింది. బంగారం ఫ్యూచర్స్ 2.05 శాతం అంటే రూ. 3,189 తగ్గి, 10 గ్రాములకు రూ. 1,52,551 వద్ద ముగిసింది. వెండి ఫ్యూచర్స్ 6.27 శాతం అంటే రూ. 16,595 తగ్గి, కిలోకు రూ. 2,48,201 వద్ద ముగిసింది.

Updated on: May 30, 2026 | 12:07 PM

బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఈ వారంలో భారీ ఎత్తున పడిపోతున్నాయి. వారం ప్రారంభంలో కుప్పకూలగా.. మధ్యలో స్వల్పంగా పెరిగాయి. కానీ వారం చివరి నాటికి మళ్లీ క్రాష్ అయ్యాయి. ఈ వారం మొత్తం చూస్తే పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం సద్దుమణగడం, కాల్పులు విరమణ, శాంతి ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకోవడంతో బంగారం ధరలు పడిపోతూ వస్తోన్నాయి. శాంతి ఒప్పందంపై సంతకాలు చేస్తే ధరలు వచ్చే వాంరలో మరింత తగ్గే అవకాశముంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలో ఐదు ట్రేడింగ్ రోజుల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా కొనసాగాయో ఒకసారి చూద్దాం.

పతనమైన బంగారం

ట్రేడింగ్ కొనసాగిన గత ఐదు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.3,040 తగ్గగా.. వెండి ధరలు రూ.4,500 తగ్గాయి. వారం మధ్యలో ఈ రెండు స్వల్పంగా పుంజుకోగా.. చివరి నాటికి ధరలు తగ్గాయి. హెచ్చుతగ్గుల మధ్య చివరికి ధరలు తగ్గుదల ధోరణిని కొనసాగించాయి. మే 24న 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,350గా ఉండగా.. మే 26న అత్యధిక తగ్గుదల నమోదైంది. మే 27న బంగారం ధరలు పుంజుకున్నప్పటికీ.. మే 28న మళ్లీ పడిపోయాయి. మే 29న 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,810 వద్ద ముగిసింది. ఐదు ట్రేడింగ్ రోజుల్లో మొత్తం రూ.3 వేలకుపైగా పడిపోయింది.

వెండి ధరలు కూడా డౌన్

ఇక గత 5 రోజుల్లో బంగారం బాటలోనే వెండి ధర కూడా పతనమైందని చెప్పవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య వెండి ధర రూ.4,500 మేర పడిపోయింది. సోమవారం 999 స్వచ్ఛత గల కిలో వెండి ధర రూ.272,290గా ఉంది. మే 27న పెరగ్గా.. శుక్రవారం మరింత తగ్గి కిలోకు రూ. 2,67,790 వద్ద ముగిసింది. మొత్తానికి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుచేసేవారు ఊరట చెందుతున్నారు.

ప్రస్తుత ధరలు ఇవే..

ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,57,040గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,950 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,59,600గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,300గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి రూ.2.90 లక్షలుగా ఉంది.

Follow Us