Gold Prices: కుదేలైన బంగారం ధరలు.. వారం రోజుల్లో ఢమాల్.. ఒకేసారి ఎంత తగ్గాయంటే..?

బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. వారం రోజుల్లో ధరలు పడిపోయాయి. అమెరికా డాలర్ బలపడటంతో పాటు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ఇది ఊరటనిచ్చే అంశం.

Gold Prices: కుదేలైన బంగారం ధరలు.. వారం రోజుల్లో ఢమాల్.. ఒకేసారి ఎంత తగ్గాయంటే..?
Gold Prices

Updated on: Nov 14, 2026 | 8:20 PM

బంగారం, వెండి ధరలు భారీగా కుదేలయ్యాయి. ఈ పరిణామం కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తోంది. అయితే పెట్టుబడిదారుల్లో మాత్రం ఆందోళనను వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజుల్లో పసిడి ధరల్లో బిగ్ క్రాష్ కనిపించింది. భారీగా డౌన్ కావడంతో వినియోగదారులు మళ్లీ గోల్డ్ షాపుల వైపు చూస్తున్నారు. గోల్డ్‌తో పోటీగా వెండి ధర ఇప్పుడు భారీగా పడిపోతోంది. ధరల పతనానికి అంతర్జాతీయ కారణాలతో పాటు డాలర్ కదలికల్లో మార్పులు వంటివి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రూ.లక్షకు బంగారం ధరల పడిపోతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వారం రోజుల్లో ఎంత తగ్గిందంటే..?

-ఢిల్లీలో బంగారం ధరలు ఈ వారంలో భారీగా డౌన్ అయ్యాయి. నవంబర్ 6 నుండి నవంబర్ 13 మధ్య 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.5,643 మేర తగ్గుముఖం పట్టింది. దేశీయంగా డిమాండ్ తగ్గడం వల్ల ధరలు పడిపోయినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

-ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) డేటా ప్రకారం చూసుకుంటే.. ఢిల్లీలో నవంబర్ 6వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,452 వద్ద ఉండగా.. నవంబర్ 13 నాటికి రూ,1,35,809కి చేరుకుంది.

-హైదరాబాద్‌లో నవంబర్ 8వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 వద్ద ఉండగా.. నవంబర్ 14 నాటికి రూ.1,37,620కి చేరుకున్నాయి. అంటే రూ.5950 మేర తగ్గాయి. ఇక నవంబర్ 8న 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,600 వద్ద ఉండగా.. నవంబర్ 14 నాటికి రూ.1,26,150 వద్ద కొనసాగుతోంది. అంటే రూ.5450 మేర కుప్పకూలింది.

ధరల పతనానికి కారణాలు ఇవే..

ఈ ధరల పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలుగా ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నాయి. అమెరికా డాలర్‌లో మార్పులు, బాండ్ ఈల్డ్స్ పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి అవలంబించవచ్చన్న అంచనాలు బంగారం ధరలపై పడుతున్నాయి. అమెరికాలో ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరిగినప్పుడు బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. బాండ్ ఈల్డ్స్ పెరిగడం వల్ల బంగారంతో పోలిస్తే బాండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు ఎక్కువగా వస్తాయి. అలాగే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే ఎలాంటి వడ్డీ ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతుంది. దీంతో బంగారం పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర రంగాల్లోకి మళ్లిస్తున్నారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని పెంచి ధరలను కిందకు నెడుతోంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us