Gold-Silver Price Today: మహిళలు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం ధరలు.. అదే బాటలో పయనిస్తున్న వెండి

|

Sep 25, 2021 | 7:18 AM

Gold-Silver Price Today(september 25th 2021) : భారతీయ ప్రజలు బంగారం, వెండి లోహాలను  ఒక ఆస్తిగా భావిస్తారు. అలంకరణ కోసమేకాదు ఆర్ధికంగా అత్యవసరమైతే తమను బంగారం ఆదుకుంటుందని..

Gold-Silver Price Today: మహిళలు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం ధరలు.. అదే బాటలో పయనిస్తున్న వెండి
Gold And Silver
Follow us on

Gold-Silver Price Today(september 25th 2021) : భారతీయ ప్రజలు బంగారం, వెండి లోహాలను  ఒక ఆస్తిగా భావిస్తారు. అలంకరణ కోసమేకాదు ఆర్ధికంగా అత్యవసరమైతే తమను బంగారం ఆదుకుంటుందని భావిస్తారు. అందుకనే ఏ  చిన్న సందర్భం దొరికినా బంగారం కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తారు. బంగారంపై వివిధ రూపాయల్లో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. విలువైన లోహాన్ని నగలు, నాణేలుగా విక్రయిస్తారు. ఆభరణం లోహం ప్రధానంగా వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించబడుతుంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి  గుడ్ న్యూస్. ఈరోజు పసిడి ధర కొంతమేర దిగింది. నిన్న దిగొచ్చిన పసిడి రేటు ఈరోజు కూడా పడిపోయింది. నేలచూపులు చూసింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడిచి.. కొంతమేర దిగివచ్చింది.

బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావం ఇవి గ్లోబల్ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటుంది. ఈరోజున తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో బంగారం ధరలు, వెండి ధరలు  ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర రూ. 4360 లు ఉండగా రూ. 40తగ్గి ఈరోజు రూ. 4,320లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 43600 ఉండగా రూ. 400లు తగ్గి.. నేడు రూ. 43,200లు గా నమోదైంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న రూ. 4,756లు ఉండగా నేడు రూ.43 తగ్గి ఈరోజు 4,713లకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. నిన్న రూ. 47,560 లు ఉండగా.. నేడు రూ. 430 మేర తగ్గి నేడు 47,130 లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.

వెండి ధర:

శనివారం రోజున వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. దీంతో వెండిని ధర స్వల్పంగా తగ్గింది.  దీంతో శనివారం రోజున కిలో వెండి ధర రూ.64,900కు పడిపోయింది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధర రూ. 200మేర తగ్గింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లలకు వెండి వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే శుభతరుణం.

Also Read: Horoscope Today: రాశిఫలాలు నేడు…. ఏ రాశివారికి గ్రహబలం అనుకూలంగా ఉండి చేపట్టిన పనులు జరుగుతాయంటే..