Gold Rate: ఓర్నీ ఇదేంది.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?

Gold And Silver Price In Hyderabad - Vijayawada: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు దాదాపు రూ.5వేల వరకు దిగివచ్చాయి.. అయితే.. ఈ క్రమంలోనే బంగారం ధర మళ్లీ భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు..

Gold Rate: ఓర్నీ ఇదేంది.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?
Gold And Silver Price

Updated on: Jul 01, 2025 | 11:40 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చినట్టే ఇచ్చి.. అమాంతం మళ్లీ పెరిగాయి.. ఇటీవల కాలంలో లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు దాదాపు రూ.5వేల వరకు దిగివచ్చాయి.. అయితే.. ఈ క్రమంలోనే బంగారం ధర మళ్లీ భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.. తాజాగా.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. పది గ్రాముల బంగారం పై ఏకంగా రూ.1,140 మేర ధర పెరిగింది.. జులై 1 2025 మంగళవారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 98,400 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,200 లుగా ఉంది. గోల్డ్ 24 క్యారెట్ల పై రూ.1140, 22 క్యారెట్లపై రూ.1,050 మేర ధర పెరిగింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి కిలోపై రూ.2,300 మేర ధర పెరిగి.. రూ.1,10,00లుగా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,400 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,200 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉంది.
  2. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,400, 22 క్యారెట్ల ధర రూ.90,200లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,20,000 లుగా ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,550, 22 క్యారెట్ల ధర రూ.90,350 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,000 లుగా ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,400, 22 క్యారెట్ల ధర రూ.90,200 ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000 గా ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,400 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,200 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,20,000 లుగా ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,400, 22 క్యారెట్ల ధర రూ.90,200 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us