Gold Price Today: భలే మంచి రోజు.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. తులం ఎంతంటే.?

|

Aug 09, 2024 | 7:29 AM

ఊపిరి పీల్చుకో వినియోగదారుడా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అలాగే నిన్నటితో పోలిస్తే గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకులు, ఆర్ధిక మాంద్యం లాంటి అంశాలు

Gold Price Today: భలే మంచి రోజు.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. తులం ఎంతంటే.?
Today Gold Price
Follow us on

ఊపిరి పీల్చుకో వినియోగదారుడా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అలాగే నిన్నటితో పోలిస్తే గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకులు, ఆర్ధిక మాంద్యం లాంటి అంశాలు బంగారం ధరలు తగ్గుదలపై ప్రభావం చూపిస్తున్నాయని బిజినెస్ నిపుణులు అంటున్నారు. గత 3 రోజులుగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1310 మేరకు తగ్గింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1200 మేర దిగింది. ఈ క్రమంలో ఆగష్టు 9న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 63 వేల 490 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ. 69 వేల 260 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63 వేల 640 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ. 69 వేల 410 వద్ద ఉంది.

వెండి ధరలు..

వెండి కూడా బంగారం బాటలో పయణిస్తోంది. గడిచిన 4 రోజుల్లో రూ. 4300 మేరకు తగ్గింది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి రూ. 86,400 దగ్గర ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ. 80900గా, ముంబై, ఢిల్లీలలో రూ. 81,400గా కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి రూ. 81,400 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..