Latest Petrol Diesel Prices: పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మండిపోతుండంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గురువారం కూడా చమురు ధరలను మరోసారి పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతున్న ధరలను తగ్గించాలని వాహనదారులు కోరుతున్నప్పటికీ.. పెరగడం మాత్రం ఆగడం లేదు. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు గురువారం లీటరు పెట్రోల్‌పై 36, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. అయితే.. వరుసగా.. ఇప్పటివరకు 20కిపైగా సార్లు ధరలు పెరుగుతూ వచ్చాయి.
మెట్రలో నగరాల్లో ధరలు..
దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.108.29, డీజిల్ ధర రూ.97.02 కి పెరిగింది.
ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.114.14, డీజిల్ రూ.105.12 కి చేరింది.
చెన్నైలో పెట్రోల్ రూ.105.13 కి చేరగా.. డీజిల్ రూ.101.25 కి పెరిగింది.
కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.78 కి పెరగగా.. డీజిల్ రూ.100.14 కి చేరింది.
హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.112.64 కి చేరగా.. డీజిల్ ధర రూ.105.84కి పెరిగింది.
ఏపీలోని విజయవాడలో పెట్రోల్ ధర 114.48కి చేరగా.. డీజిల్ ధర 107కి ఎగబాకింది.
దేశీయ పెట్రోలియం సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి. దీనిలో భాగంగా.. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి.
Also Read: