Crorepati Stocks: ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో రాబడి వరద.. ఏడాదిలో ఊహకందని లాభాలు

|

Aug 15, 2024 | 3:30 PM

భారతదేశంలో పెట్టుబడిదారుల ఆలోచనలు మారుతున్నాయి. గతంలో తక్కువ రాబడి వచ్చినా పెట్టుబడికి హామీనిచ్చే చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడేవారు. అయితే మారుతున్న కాలంతో టెక్నాలజీ కారణంగా ఆర్థిక అక్షరాస్యత పెరగడంతో తక్కువ సమయంలో అధిక రాబడినిచ్చే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. పెట్టుబడి రిస్క్‌లో ఉన్నా పర్లేదు కానీ మంచి రాబడి కావాలని కోరుకుంటున్నారు. కేవలం ఒక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ నుంచి అసాధారణమైన రాబడిని పొందడం అనేది ఏ పెట్టుబడిదారులకైనా కలగా ఉంటుంది.

Crorepati Stocks: ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో రాబడి వరద.. ఏడాదిలో ఊహకందని లాభాలు
Stock Market
Follow us on

భారతదేశంలో పెట్టుబడిదారుల ఆలోచనలు మారుతున్నాయి. గతంలో తక్కువ రాబడి వచ్చినా పెట్టుబడికి హామీనిచ్చే చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడేవారు. అయితే మారుతున్న కాలంతో టెక్నాలజీ కారణంగా ఆర్థిక అక్షరాస్యత పెరగడంతో తక్కువ సమయంలో అధిక రాబడినిచ్చే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. పెట్టుబడి రిస్క్‌లో ఉన్నా పర్లేదు కానీ మంచి రాబడి కావాలని కోరుకుంటున్నారు. కేవలం ఒక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ నుంచి అసాధారణమైన రాబడిని పొందడం అనేది ఏ పెట్టుబడిదారులకైనా కలగా ఉంటుంది. భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15, 2023 నుంచి పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందించిన కొన్ని స్టాక్‌ల గురించి తెలుసుకుందాం.

ఆగస్టు 14, 2023 నుంచి షేర్ ధరలో శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్ 30,759 శాతం పెరుగుదల సాధించింది. కార్పొరేట్ డేటాబేస్ ఏస్ ఈక్విటీ ప్రకారం ఆగస్ట్ 14, 2023న రూ. 1.45 నుంచి ఆగస్ట్ 14, 2024 నాటికి రూ. 447.45కి పెరిగింది. ఏడాది క్రితం ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలనే దూరదృష్టి ఉన్న ఇన్వెస్టర్లు ఇప్పుడు ఊహకందని లాభాలను సాధించారు. బెంచ్‌మార్క్ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 గత ఏడాదిలో 24 శాతం లాభపడగా, నిఫ్టీ తదుపరి 50 ఇండెక్స్ 63 శాతం ర్యాలీ చేసింది. అయితే ఇదే కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 150, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీలు కూడా వరుసగా 49శాతం, 52 శాాతానికి పెరిగాయి. వైస్రాయ్ హోటల్స్ మైండ్‌బాగ్లింగ్ రిటర్న్‌లను అందించాయి. ఇదే సమయంలో ఈ కంపెనీ షేర్లు రూ.2.40 నుంచి రూ.118.24కి పెరిగాయి. అలాగే షేఖావతి ఇండస్ట్రీస్ స్టాక్స్ కూడా గత ఏడాది ఆగస్టు 14న రూ.0.45గా ఉన్న కంపెనీ షేర్లు ఆగస్టు 13, 2024న 1,627 శాతానికి పెరిగి రూ.7.77కి చేరుకున్నాయి. ఆర్‌బీఎం ఇన్‌ఫ్రాకాన్, స్కై గోల్డ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా), సహానా సిస్టమ్, వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్, కోర్ డిజిటల్, వీ2 రిటైల్ షేర్లు కూడా ఇదే కాలంలో 600-1,000 శాతం పెరిగాయి. 

దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు తయారీ, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవలు, పునరుత్పాదక, ఆరోగ్య సంరక్షణ, ఈ-కామర్స్, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, వినియోగం వంటి రంగాల్లో పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాదిలో ఒరియానా పవర్, మాక్‌పవర్ సీఎన్‌సీ మెషీన్స్, ఆర్ఎస్ సాఫ్ట్‌వేర్ (ఇండియా), యూనిటెక్, శక్తి పంప్‌లు (ఇండియా), గాయత్రీ రబ్బర్స్, కెమికల్స్, జోడియాక్ ఎనర్జీ, క్రౌన్ లిఫ్టర్స్, వండర్ ఎలక్ట్రికల్స్, నెట్‌వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్, కొచ్చిన్ షిప్‌యార్డ్, ఎస్ అండ్ ఎస్ పవర్ స్విచ్‌గేర్ 500 శాతానికి పైగా రాబడిని అందించాయి. అలాగే బ్రోకరేజ్ విస్తృత మార్కెట్లలో ఇండియన్ హోటల్స్, అశోక్ లేలాండ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, కేఈఐ ఇండస్ట్రీస్, పీఎన్‌బీ హౌసింగ్, సెల్లో వరల్డ్, కళ్యాణ్ జ్యువెలర్స్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఏంజెల్ వన్, మెట్రో బ్రాండ్‌లు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..