EPFO New Rule: మరింత సులభం.. కాగితాలతో పనిలేకుండా పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త అకౌంట్‌కు బదిలీ చేసుకోండిలా!

EPFO New Rule: ఎటువంటి పేపర్‌వర్క్ లేకుండా, పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త అకౌంట్‌కు బదిలీ చేసుకునేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. పరిష్కరించిన కొత్త ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ (EPFO Member Portal) ద్వారా ఉద్యోగులు రెండు సులువైన..

EPFO New Rule: మరింత సులభం.. కాగితాలతో పనిలేకుండా పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త అకౌంట్‌కు బదిలీ చేసుకోండిలా!
Pf Balance

Updated on: Jul 10, 2026 | 11:55 AM

EPFO New Rule: ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత కంపెనీలోని ప్రావిడెంట్ ఫండ్ (PF) బ్యాలెన్స్‌ను కొత్త కంపెనీ అకౌంట్‌కు బదిలీ చేయడం గతంలో పెద్ద ప్రహసనంగా ఉండేది. పాత కంపెనీ నుంచి అనుమతులు తీసుకుంటూ పొందిన లేటర్‌ను కొత్త కంపెనీ అందించాల్సి ఉండేది. అది కూడా పెద్ద ప్రాసెస్‌ ఉండేది. కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ప్రక్రియను మరింత సరళతరం చేసింది. ఎటువంటి పేపర్‌వర్క్ లేకుండా, పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త అకౌంట్‌కు బదిలీ చేసుకునేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. పరిష్కరించిన కొత్త ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ (EPFO Member Portal) ద్వారా ఉద్యోగులు రెండు సులువైన పద్ధతుల్లో తమ అకౌంట్‌ను బదిలీ చేసుకోవచ్చు.

పీఎఫ్ బదిలీకి ఉన్న 2 ఆన్‌లైన్ మార్గాలు:

మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత కింద పేర్కొన్న రెండు ఆప్షన్ల ద్వారా బదిలీ ప్రక్రియను ప్రారంభించవచ్చు:

  1. రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అకౌంట్: పోర్టల్‌లోని ‘Online Services’ ట్యాబ్‌లోకి వెళ్లి ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా నేరుగా మీ పాత పీఎఫ్ అకౌంట్‌ను ప్రస్తుత కంపెనీ అకౌంట్‌కు బదిలీ చేయమని ఆన్‌లైన్ రిక్వెస్ట్ పెట్టవచ్చు.
  2. మెంబర్ సర్వీస్ హిస్టరీ: ఈ సెక్షన్‌లో మీ ప్రస్తుత, పాత ఉద్యోగాల వివరాలు, ఆధార్ లింక్ అయిన యూఏఎన్ (UAN), మెంబర్ ఐడీలు, గత క్లెయిమ్‌ల స్టేటస్ అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ పాత అకౌంట్ బ్యాలెన్స్ ఇంకా బదిలీ కాకపోతే, ఇక్కడి నుంచే నేరుగా ‘సర్వీస్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ (Form 13)’ ను సబ్మిట్ చేయవచ్చు.

బదిలీ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

మీరు ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నా, అది మిమ్మల్ని ‘ఆన్‌లైన్ సర్వీస్/ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్’ పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీ పాత కంపెనీ మెంబర్ ఐడీ, ఇతర వివరాలను నమోదు చేసి ‘Get Details’ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ అభ్యర్థన పూర్తవుతుంది. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ ఆ సొమ్మును మీ కొత్త అకౌంట్‌కు బదిలీ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

పీఎఫ్ బదిలీ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

కేవలం డబ్బులు ఒక చోటు నుంచి మరోచోటికి మారడమే కాకుండా దీనివల్ల దీర్ఘకాలికంగా పలు ప్రయోజనాలు ఉన్నాయి:

  1. పెన్షన్ అర్హత: పీఎఫ్ బదిలీ చేయడం వల్ల మీ మొత్తం సేవా కాలం (Service History) నిరంతరాయంగా కొనసాగుతుంది. పెన్షన్ పొందడానికి కనీసం 10 ఏళ్ల సర్వీస్ అవసరం కాబట్టి ఇది చాలా ముఖ్యం.
  2. పన్ను మినహాయింపు: నిరంతర సర్వీస్ రికార్డు ఉండటం వల్ల భవిష్యత్తులో పీఎఫ్ డబ్బులు డ్రా చేసేటప్పుడు పడే టీడీఎస్ (TDS) పన్ను భారం తప్పుతుంది.
    భారీ ఇన్సూరెన్స్ లబ్ధి: ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద లభించే రూ. 7 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం ఎటువంటి అంతరాయం లేకుండా వర్తిస్తుంది.

గమనిక: కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన పోర్టల్ పూర్తిగా స్థిరపడటానికి 2 నుండి 3 వారాల సమయం పట్టవచ్చని, అందువల్ల అప్పుడప్పుడు సాంకేతిక ఇబ్బందులు ఎదురుకావచ్చని ఈపీఎఫ్ఓ తెలిపింది. అందుకే ఉద్యోగులు వీలైనంత త్వరగా తమ పీఎఫ్ బదిలీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఇక నుంచి టికెట్‌ను స్క్రీన్‌షాట్‌, వాట్సాప్‌లో చూపించలేరు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us