Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..!

Elon Musk's Net Worth: ఎలాన్ మస్క్ సంపదలో ప్రధాన భాగం ఆయనకు చెందిన కంపెనీల్లోని వాటాల విలువపై ఆధారపడి ఉంటుంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లు, స్పేస్‌ఎక్స్ అంతరిక్ష పరిశోధన, స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్, ఏఐ రంగాల్లోని వ్యాపార పరిణామాలు ఆయన సంపదపై ప్రభావం చూపుతాయి..

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..!
Elon Musk

Updated on: Nov 14, 2026 | 9:35 AM

Elon Musk’s Net Worth: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సంపద గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజుకు వందలు, వేల రూపాయలు సంపాదించేందుకు కష్టపడుతుంటే.. ఈ టెక్ దిగ్గజం సంపద మాత్రం రోజుకు సగటున రూ.8,000 కోట్లకు పైగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఆయన ఆ హోదాను ప్రస్తుతం కోల్పోయారు. అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నారు.

ఏడాదిలో రూ.30 లక్షల కోట్లకు పైగా పెరిగిన సంపద:

BestBrokers విశ్లేషణ ప్రకారం.. 2025 జూలై నుంచి 2026 జూలై మధ్య ఎలాన్ మస్క్ సంపద సుమారు 320 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.30 లక్షల కోట్లకు పైగా. ఈ మొత్తాన్ని ఏడాదిలోని 365 రోజులకు విభజిస్తే రోజుకు సగటున 875 మిలియన్ డాలర్లు వస్తాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.8,000 కోట్లకు పైమాటే. ఈ లెక్కల ఆధారంగానే రోజుకు రూ.8,300 కోట్ల సంపద పెరిగిందనే వార్తలు వెలువడ్డాయి.

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు:

2026 జూన్ 12న స్పేస్‌ఎక్స్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన తర్వాత ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరిగింది. ఫోర్బ్స్ కథనం ప్రకారం.. ఆయన సంపద 1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచారు. అయితే ఆ ఆనందం ఎక్కువకాలం కొనసాగలేదు. స్పేస్‌ఎక్స్ షేర్ల విలువ తగ్గడం, మార్కెట్ పరిణామాల కారణంగా ఆయన సంపద కూడా గణనీయంగా పడిపోయింది.

ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ ఎంత?

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం 2026 నవంబర్ 13 నాటికి ఎలాన్ మస్క్ నికర సంపద 887.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.80 లక్షల కోట్లకు పైగా. ఈ జాబితాలో ఆయన ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ఈ సంపద విలువ షేర్ల ధరలు, కంపెనీల విలువల్లో మార్పుల ఆధారంగా ప్రతిరోజూ మారుతూ ఉంటుంది.

మస్క్ సంపద ఎలా పెరుగుతోంది?

ఎలాన్ మస్క్ సంపదలో ప్రధాన భాగం ఆయనకు చెందిన కంపెనీల్లోని వాటాల విలువపై ఆధారపడి ఉంటుంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లు, స్పేస్‌ఎక్స్ అంతరిక్ష పరిశోధన, స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్, ఏఐ రంగాల్లోని వ్యాపార పరిణామాలు ఆయన సంపదపై ప్రభావం చూపుతాయి.

కంపెనీల షేర్ల ధరలు పెరిగితే ఆయన నికర సంపద పెరుగుతుంది. అదే షేర్ల ధరలు పడిపోతే సంపద కూడా తగ్గుతుంది. అందువల్ల రోజుకు రూ.8,300 కోట్లు పెరిగాయంటే ఆ మొత్తం ఆయన బ్యాంకు ఖాతాలోకి వచ్చిందని అర్థం కాదు. అది సంపద విలువలో నమోదైన సగటు పెరుగుదల మాత్రమే.

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలోనే..

ట్రిలియనీర్ హోదా కోల్పోయినప్పటికీ ఎలాన్ మస్క్ తన అగ్రస్థానాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. ఫోర్బ్స్ తాజా గణాంకాల ప్రకారం ఆయన తర్వాత జెఫ్ బెజోస్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. టెక్నాలజీ రంగంలో కంపెనీల విలువలు పెరగడం, పెట్టుబడుల మార్పులు ప్రపంచ కుబేరుల సంపదలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

SBI Home Loan: ఎస్‌బీఐ నుంచి రూ. కోటి హోమ్‌ లోన్‌ కావాలంటే మీకు ఎంత జీతం ఉండాలి? EMI ఎంత?

BSNL: రూ.202 ప్లాన్‌తో 32 రోజుల వ్యాలిడిటీ.. రూ.లక్ష ఉచిత ఇన్సూరెన్స్‌.. అదిరిపోయే బెనిఫిట్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us