
ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం, వినూత్న ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఎలాన్ మస్క్ ఆలోచనా విధానం ఎప్పుడూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అసాధ్యమనుకున్న అనేక సవాళ్లను సుసాధ్యం చేస్తూ, భవిష్యత్ సాంకేతికతను వాస్తవ రూపంలోకి తేవడంలో ఆయన అనుసరించే సూత్రాలు యువతను ఎప్పుడూ ముందుకు నడిపిస్తాయి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, పెద్ద లక్ష్యాలను సాధించాలన్నా మస్క్ అనుసరించే ఫిలాసఫీ ఎంతో మందికి ఆదర్శం. మనం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, విజయపథంలో ఎలా నడవాలో వివరిస్తూ ఎలాన్ మస్క్ చెప్పిన కొన్ని శక్తివంతమైన సూక్తుల గురించి చాలా మందికి తెలియవు.
జీవితంలో నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే, ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన ప్రశ్న అడగాలి. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు సరైన ప్రశ్న వేయడమే సగం సమస్యను పరిష్కరించినట్లేనని మస్క్ నమ్ముతారు. సరైన దిశలో ఆలోచించడం వల్లనే పెద్ద పెద్ద సాంకేతిక అద్భుతాలు సాధ్యమయ్యాయి.
నేను ఎప్పుడూ వదిలేయాలని అనుకోలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్నిసార్లు నష్టాలు వచ్చినా తన లక్ష్యం నుండి ఎప్పుడూ వెనక్కి తగ్గేది లేదని మస్క్ నిరూపించారు. పట్టుదల ఉంటేనే ఏ రంగంలోనైనా నిలదొక్కుకోగలమని ఆయన ప్రయాణం చెబుతుంది.
మీరు మీ పూర్తి శక్తిని పెట్టాలి. మీరు వారానికి 80 నుండి 100 గంటలు పని చేస్తుంటే, ఇతరులు వారానికి 40 గంటలు పని చేస్తున్నప్పటికీ, వారికి ఒక సంవత్సరం పట్టే పనిని మీరు నాలుగు నెలల్లోనే సాధిస్తారు. విజయానికి షార్ట్కట్లు ఉండవు. అసాధారణమైన ఫలితాలు రావాలంటే అసాధారణమైన శ్రమ కూడా అవసరమని మస్క్ గట్టిగా నమ్ముతారు.
మీకు ఎవరూ సహాయం చేయకపోతే, ఒంటరిగా చేయండి. జీవితంలో లేదా వ్యాపారంలో ఎవరైనా సాయం వస్తారని ఎదురుచూడకుండా, మన సొంత బలంతో ముందుకు సాగాలని ఇది సూచిస్తుంది. స్వీయ నమ్మకమే మనిషిని గెలిపిస్తుంది.
మీరు మీ లక్ష్యాన్ని సాధించడం ఇప్పుడే ప్రారంభిస్తుంటే, మీరు మీ పూర్తి కృషిని పెట్టాలి. ప్రతిదీ సున్నా నుండే మొదలవుతుంది. మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్లాలన్నా ప్రయాణం ఎప్పుడూ చిన్న ప్రారంభం నుంచే మొదలవుతుంది. ఆరంభంలో పెట్టే శ్రమే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
ఏదైనా విషయం అత్యంత ముఖ్యమైనది అయినప్పుడు, మీరు పరిస్థితులను చూడకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దాన్ని పూర్తి చేస్తారు. మనసు పెట్టి పనిచేస్తే చుట్టూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదని మస్క్ భావిస్తారు.
వైఫల్యం అనేది ఒక ఎంపిక, మీరు విఫలం కాకపోతే, మీకు కొత్త ఆవిష్కరణ ఆలోచనలు రావు. తప్పులు చేయడం, వాటి ద్వారా నేర్చుకోవడం వ్యాపారంలో భాగమే. వైఫల్యాలకు భయపడితే కొత్త ఆవిష్కరణలు పుట్టవని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు.
పనులను మరింత మెరుగ్గా ఎలా చేయవచ్చో నిరంతరం ఆలోచించడమే ఉత్తమ సలహా. ఒకసారి విజయం సాధించామనే సంతృప్తితో ఆగిపోకుండా, ప్రతిరోజూ కొత్తగా ఆలోచించడం, పనులను మరింత సమర్థవంతంగా చేయడం ద్వారానే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.
సాధారణ ప్రజలు కూడా అసాధారణంగా ఉండాలని ఎంచుకుని, ఈ ప్రపంచంలో అద్భుతాలు సృష్టించగలరు. ప్రతి మనిషిలోనూ అద్భుతమైన సామర్థ్యాలు ఉంటాయి. కేవలం సాధారణ జీవితంతో సరిపెట్టుకోకుండా, అసాధారణమైన లక్ష్యాలను ఎంచుకుంటే చరిత్ర సృష్టించవచ్చని మస్క్ జీవితం నిరూపిస్తోంది.