Driving Licence: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా..? ఈ నెలాఖరు వరకే ఛాన్స్..!

డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరుకు అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అసలు అది నిజమేనా.. కదా అనేది చూద్దాం.

Driving Licence: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా..? ఈ నెలాఖరు వరకే ఛాన్స్..!
Driving License

Updated on: Sep 28, 2026 | 10:01 PM

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ఒక ఫేక్ న్యూస్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. సెప్టెంబర్ 30వతేదీ నాటికి డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేయకపోతే.. లైసెన్స్‌లు రద్దు అవుతాయని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన పడుతున్నారు. మొబైల్ నెంబర్ లింక్ చేసుకునేందుకు రవాణాశాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. మరికొంతమంది ఆన్ లైన్ ద్వారా అప్డేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రచారాన్ని ఖండించింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) వంటి కీలక పత్రాలతో ప్రస్తుత మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయమని వాహనదారులను కేంద్రం కోరుతోంది. స్పష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, రవాణా సంబంధిత సేవలను ప్రజలకు మరింత సులభతరం అందించేందుకు ఈ సూచన చేసింది. దీంతో మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని చాలామంది భావిస్తున్నారు.

గతంలో డ్రైవింగ్ లైసెన్సుల దరఖాస్తు ప్రక్రియలో ఏజెంట్ల పాత్ర ఎక్కువగా ఉండేది. చాలా మంది ఏజెంట్లు దరఖాస్తుదారుల అసలు మొబైల్ నంబర్‌కు బదులుగా తమ సొంత నంబర్‌లను లేదా ఇతర నంబర్‌లను నమోదు చేసేవారు. దీనివల్ల లైసెన్స్ పునరుద్ధరణ, జరిమానాలు, ఇతర ముఖ్యమైన సమాచారం వంటి విషయాల్లో వాహనదారులకు నేరుగా ప్రభుత్వంతో కమ్యూనికేషన్ సాధ్యమయ్యేది కాదు. ఈ సమస్యలను అధిగమించడానికి వాహనదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్, RCలకు తమ సొంత మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. పారివాహన్ లేదా ఎం-పారివాహన్ వంటి పోర్టల్‌ల ద్వారా తమ వివరాలను సులభంగా యాక్సెస్ చేయడానికి, అప్‌డేట్‌లను పొందడానికి ఇవి సహాయపడుతుంది. మొబైల్ నంబర్ అప్‌డేట్‌కు సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ తేదీ కేవలం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఒక తప్పుడు సమాచారం మాత్రమేనని కేంద్రం చెబుతోంది.

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. మొబైల్ నంబర్ అప్‌డేట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, దీనికి ఎటువంటి గడువు తేదీ లేదని కేంద్రం తెలిపింది. ప్రజలు తమకు వీలైనప్పుడు, నెమ్మదిగా అప్‌డేట్‌ను చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇలాంటి తప్పుడు వార్తలు అనవసరమైన భయాందోళనలను సృష్టిస్తాయని తెలిపింది. ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us