SBI: ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో మెసేజ్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో..

|

May 18, 2024 | 6:59 AM

డిజిటల్‌ ట్రన్సాక్షన్స్‌ భారీగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు సైతం స్మార్ట్‌ఫోన్‌లో లావాదేవీలు చేసే రోజులు వచ్చేశాయ్‌. యూపీఐ యాప్స్ అందుబాటులోకి రావడం, అందరూ స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగిస్తుండడంతో ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరిగాయి. అయతే ఇదే క్రమంలో ఆర్థిక నేరాలు సైతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా రకరకాల లింక్‌లను...

SBI: ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో మెసేజ్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో..
Sbi Rewardz
Follow us on

డిజిటల్‌ ట్రన్సాక్షన్స్‌ భారీగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు సైతం స్మార్ట్‌ఫోన్‌లో లావాదేవీలు చేసే రోజులు వచ్చేశాయ్‌. యూపీఐ యాప్స్ అందుబాటులోకి రావడం, అందరూ స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగిస్తుండడంతో ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరిగాయి. అయతే ఇదే క్రమంలో ఆర్థిక నేరాలు సైతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా రకరకాల లింక్‌లను పంపుతూ కస్టమర్ల ఖాతాలోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఎప్పటికప్పుడు కొంగొత్త మార్గంలో బురిడీ కొట్టిస్తున్నారు.

తాజాగా ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరిట ఓ మోసం వెలుగులోకి వచ్చింది. ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ల్లో కొన్ని మెసేజ్‌లు వస్తున్నాయి. ఇందుకోసం సైబర్‌ నేరగాళ్లు ఏకంగా వాట్సాప్‌ను హ్యాక్‌ చేస్తున్నారు. వాట్సాప్‌ గ్రూప్స్‌లో తెలిసిన వ్యక్తుల నుంచి మెసేజ్‌లు వస్తుండడంతో వెనకా ముందు చూడకుండా లింక్‌లను క్లిక్‌ చేసి, ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. ఎస్‌బీఐ రివార్డ్‌ పేరుతో వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేయడంతో రూ. 50 వేలు కోల్పోయిన సంఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది.

ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో ఓ లింక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ మెసేజ్‌లో ‘మీ ఎస్‌బీఐ రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది. అది ఈ రోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి, తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి’. దీంతో పాటు ఎస్‌బీఐ యోనో పేరుతో ఓ లింక్‌ను యాడ్‌ చేసి పంపిస్తున్నారు. ఈ లింక్‌ను క్లిక్‌ చేయగానే.. ప్రొఫైల్‌ ఫొటో, పేరు ఎస్‌బీఐగా మారిపోతున్నాయి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్‌ కూడా ఎస్‌బీఐ హెల్ప్‌లైన్‌ అంటూ వస్తుండటంతో ఎస్‌బీఐ అధికారికంగా పంపిన మెసేజ్‌గానే భావిస్తున్నారు.

అంతేనా మీ ప్రమేయం లేకుండానే మీ వాట్సాప్‌ నుంచి ఇదే మెసేజ్‌ మరిన్ని వాట్సాప్‌ గ్రూప్‌ల్లోకి ఫార్వర్డ్‌ అవుతున్నాయి. దీంతో కొందరు ఈ లింక్‌ను క్లిక్‌ చేసి డబ్బులు కోల్పోతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రివార్డ్స్‌ పాయింట్‌ పేరుతో వచ్చే మెసేజ్‌లను గుడ్డిగా నమ్మకూడదని చెబుతున్నారు. అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌లోకి వెళ్లి నిర్ధారించుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..