ఏ టీవీ ఎక్కువ కరెంట్‌ను వినియోగిస్తుంది..? మీ పవర్ బిల్లును ఇలా తగ్గించుకోండి..

ఇల్లు అందంగా కనిపించాలని, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ రావాలని మరీ పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీలను ఇంట్లోకి తెచ్చుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. మీరు ఎంచుకునే టీవీ మోడల్, దాని స్క్రీన్ సైజ్ మీ నెలవారీ కరెంట్ బిల్లును అడ్డగోలుగా పెంచేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల డిస్‌ప్లే టెక్నాలజీలు కరెంట్‌ను విపరీతంగా లాగేస్తాయి. ఆ విఁచాలే ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఏ టీవీ ఎక్కువ కరెంట్‌ను వినియోగిస్తుంది..? మీ పవర్ బిల్లును ఇలా తగ్గించుకోండి..
How To Reduce Tv Electricity Bill

Updated on: May 24, 2026 | 3:55 PM

నేటి కాలంలో స్మార్ట్ టీవీ లేని ఇల్లు ఉండడం అసాధ్యం. టీవీ అనేది మనిషి జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. ఈ మధ్య థియేటర్ అనుభూతి కోసం చాలామంది పెద్ద స్క్రీన్ ఉన్న టీవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే స్మార్ట్ టీవీల వల్ల నెలాఖరున వచ్చే విద్యుత్ బిల్లులు కూడా భారీగా పెరుగుతున్నాయనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి ఒక స్మార్ట్ టీవీ విద్యుత్ వినియోగం అనేది దాని స్క్రీన్ పరిమాణం, డిస్‌ప్లే టెక్నాలజీ, మనం వాడే వినియోగ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. సరైన సమాచారంతో మీరు మీ విద్యుత్ బిల్లును గణనీయంగా నియంత్రించుకోవచ్చు.

స్క్రీన్ పరిమాణం – వాటేజ్ సామర్థ్యం

ఏదైనా స్మార్ట్ టీవీ విద్యుత్ వినియోగాన్ని దాని వాటేజ్ సామర్థ్యం ద్వారా కొలుస్తారు. వాటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే, విద్యుత్ వినియోగం అంత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఒక 32 ఇంచెస్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ సాధారణంగా 30 నుండి 50 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. కానీ అదే ఒక 55 ఇంచెస్ లేదా అంతకంటే పెద్ద 4K టీవీ అయితే ఏకంగా 100 నుండి 200 వాట్ల వరకు విద్యుత్‌ను లాగేస్తుంది. టీవీని ప్రతిరోజూ సగటున 5 నుండి 6 గంటల పాటు ఉపయోగిస్తే నెలవారీ విద్యుత్ బిల్లుపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్‌లు ఉన్న టీవీలు అధిక సంఖ్యలో విద్యుత్ యూనిట్లను వినియోగిస్తూ, మీ జేబుకు చిల్లు పెడుతుంటాయి.

ఏ టీవీ ఎంత కరెంట్ కాలుస్తుంది?

మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ టీవీలు ఒకేలా ఉండవు. అవి ఉపయోగించే నిర్దిష్ట డిస్‌ప్లే టెక్నాలజీని బట్టి వాటి విద్యుత్ వినియోగం మారుతూ ఉంటుంది. ఇందులో మొదటిగా OLED టీవీల గురించి చెప్పుకోవాలి. ఇవి మార్కెట్లో అద్భుతమైన చిత్ర నాణ్యతను అందిస్తున్నప్పటికీ, వీటి విద్యుత్ వినియోగం తరచుగా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను అధిక స్థాయిలో ఉంచినప్పుడు, మీ విద్యుత్ బిల్లును పెంచడంలో ఈ పెద్ద OLED మోడల్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

మరోవైపు QLED టీవీలు ప్రకాశవంతమైన, స్పష్టమైన డిస్‌ప్లేలను అందిస్తాయి. వీటి విద్యుత్ వినియోగం OLED టీవీల కంటే కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ వీటిలో కూడా స్క్రీన్ పరిమాణం పెరిగే కొద్దీ విద్యుత్ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇక చివరిగా LED టీవీల విషయానికి వస్తే.. సాధారణ ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్న అన్నింటికంటే అత్యంత శక్తి సామర్థ్యం ఉన్నవిగా పరిగణిస్తారు. చిన్న, మధ్య తరహా ఎల్ఈడీ టీవీలు చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి కాబట్టి సాధారణ ఇంటి వినియోగానికి ఇవి ఒక గొప్ప, సురక్షితమైన ఎంపికగా నిలుస్తాయి.

మీ విద్యుత్ బిల్లును ఇలా తగ్గించుకోండి..

స్మార్ట్ టీవీని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న అలవాట్లను పాటించడం ద్వారా విద్యుత్‌ను సులభంగా ఆదా చేయవచ్చు. మొదటగా టీవీ బ్రైట్‌నెస్‌ను అవసరమైన దానికంటే ఎక్కువగా పెట్టవద్దు. ఎందుకంటే బ్రైట్‌నెస్ పెరిగే కొద్దీ పవర్ వినియోగం పెరుగుతుంది. అలాగే చాలామంది టీవీని కేవలం రిమోట్ ఉపయోగించి ఆఫ్ చేసి వదిలేస్తుంటాఇల్లు అందంగా కనిపించాలని, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ రావాలని మరీ పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీలను ఇంట్లోకి తెచ్చుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. మీరు ఎంచుకునే టీవీ మోడల్, దాని స్క్రీన్ సైజ్ మీ నెలవారీ కరెంట్ బిల్లును అడ్డగోలుగా పెంచేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల డిస్‌ప్లే టెక్నాలజీలు కరెంట్‌ను విపరీతంగా లాగేస్తాయి. ఆ విఁచాలే ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రు. అలా కాకుండా మెయిన్ స్విచ్ బోర్డు ద్వారా పూర్తిగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అదనంగా మీ స్మార్ట్ టీవీ సెట్టింగ్స్‌లో ఉండే పవర్ సేవింగ్ మోడ్ లేదా ఎనర్జీ సేవర్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసి ఉంచడం ద్వారా కూడా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Follow Us