
మునగ ఆకు, మునగ కాయలు.. ఇవి మన రోజువారి జీవితంలో ఎంతో ముఖ్యమనవి.. వీటిని ఆహారంగానే కాకుండా మునగ పొడిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అంటారు. అయితే ఇది కేవలం ఆరోగ్య పరంగా కాకుండా వాణిజ్య పరంగా కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. మార్కెట్‌లో ఈ మునగ కాయలు, మునగ ఆకులు, మునగ పొడికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దక్షిణాసియా, ఆఫ్రికా ప్రాంతాలలో సంప్రదాయ ఆహారంగా మొదలైన మునగ, ప్రస్తుతం బిలియన్ డాలర్ల విలువైన అంతర్జాతీయ పరిశ్రమగా ఎదిగింది. దీని సహజసిద్ధ పోషకాలకు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గిరాకీ పెరిగింది.
భారత ఉపఖండంలో కరువును సైతం తట్టుకొని పెరిగే ఒకే ఒక చెట్టు ఏదైనా ఉందంటే.. అది మునగ చెట్టు మాత్రమే.. అంతేకాదు దీని వేర్ల నుంచి ఆకుల వరకు ఈ చెట్టులోని ప్రతి భాగం మనకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది. మునగాకుల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మన భారతీయ వంటకాల్లో మునక్కాయకు ఎంతో ప్రధాన్యత ఉంది.. వీటిని సాంబార్, పులుసు, కూరల్లో ఎక్కువగా వాడుతారు. మునగ ఆకును కూడా కూరల్లోకి వాడుకుంటారు.
ఈ మునగ చెట్లు ఎక్కువగా ఇది అర్ధ-శుష్క, ఉపఉష్ణమండల వాతావరణంలో పెరుగుతాయి. ఎక్కవుగా భారతదేశం, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో రైతులకు ఇది ఒక వాతావరణ-అనుకూల పంటగా మంచి లాభాలను కూడా తెచ్చిపెడుతోంది.
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?
ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మునగను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మునగలో దాదాపు 80 శాతం మన దేశం నుంచే ఎగుమతి అవుతుంది. ప్రతి ఏటా మన దేశం నుంచి సుమారు 2.2 మిలియన్ టన్నుల మునగను ఉత్పత్తి అవుతోంది. మన దేశ వ్యాప్తంగా సుమారు 50,000 హెక్టార్లలో ఈ పంట సాగు చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచే ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోంది.
ప్రపంచంలో అత్యధికంగా మునగ ఉత్పత్తి చేస్తున్న టాప్ 5 దేశాలు
అమెరికా, యూరప్, చైనా వంటి దేశాల్లో ఆర్గానిక్ సప్లిమెంట్లకు డిమాండ్ పెరగడంతో ప్రపంచ మునగ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు 11.09 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో అత్యధికంగా మునగ ఉత్పత్తి చేస్తున్న టాప్ 5 దేశాలు చూసుకుంటే.. 80 శాతం ఎగుమతులతో భారత్ టాప్‌లో ఉండగా.. రెండో ప్లేస్ల్ఓ చైనా, మూడో ప్లేస్‌లో ఫిలిప్పీన్స్, నాలుగో ప్లేస్‌లో కెన్యా / మలావి, ఇక ఐదో ప్లేస్‌లో శ్రీలంక ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.