
డీమార్ట్.. ఈ పేరు తెలియనివారు దాదాపుగా ఎవరూ ఉండరు. దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన రిటైల్ చైన్ బ్రాండ్ ఇది. తక్కువ ధరకే కిరాణా సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దుస్తుల వరకు ప్రతీది ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఒక్కసారి షాపింగ్‌కు వెళ్తే చాలు.. ఇంట్లోకి అవసరమైన ప్రతీ వస్తువు ఇక్కడ లభిస్తుంది. హోల్‌సేల్ ధరలకే వస్తువులు లభించడమే కాకుండా అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఒకటి కొంటే ఒకటి ఉచితం, 50 శాతం డిస్కౌంట్ వంటి ఆఫర్లతో కస్టమర్లను డీమార్ట్ ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది. దీంతో ఎక్కువమంది డీమార్ట్‌లో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే తెలివితో, కొన్ని చిట్కాలు పాటించడం వల్ల డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అదెలా అనేది ఇక్కడ చూద్దాం.
-ముందుగా ఏయే ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు ఉన్నాయనేది చూడండి. కొన్ని వస్తువులపై ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. మీకు కావాల్సిన వస్తువుల్లో ఆఫర్లు ఉన్న ప్రొడక్ట్స్‌ను మందుగా కొనుగోలు చేయండి.
– పాడవని వస్తువులపై ఆఫర్లు ఉంటే పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేయండి. దీని వల్ల మీకు డబ్బులు ఆదా అవుతాయి. ఎక్స్‌ఫరీ డేట్‌లను చెక్ చేసి ఒకేసారి కొనుగోలు చేయండి. బియ్యం, నూనె, పప్పులు వంటివి ఎక్కువ రోజులపాటు పాడవ్వకుండా ఉంటాయి. వాటిని చిన్న ప్యాక్‌లు కాకుండా పెద్ద ప్యాక్‌లు కొనుగోలు చేయడం వల్ల డబ్బులు ఆదా అవుతాయి.
-డీమార్ట్‌కు వెళ్లేటప్పుడు ఒకేసారి షాపింగ్ లిస్ట్ తయారు చేసుకోండి. ఏయే వస్తువులు కొనాలనేది ముందే రాసుకోవడం వల్ల అనవసరైన వస్తువులు కొనకుండా ఉంటారు. వేరే వస్తువులను చూసి ఆకర్షితులైనా.. అది అనవసరమనే భావనలో ఉండటం వల్ల కొనుగోలు చేయరు. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. ముందే లిస్ట్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎంత బడ్జెట్ అవుతుందనేది ఒక అంచనా వేసుకోవచ్చు.
-వీకెండ్స్‌లో కాకుండా రద్దీ తక్కువగా ఉండే రోజుల్లో డీమార్ట్‌ను సందర్శించండి. నెల ప్రారంభంలో ఉద్యోగులకు జీతాలు వస్తాయి గనుక డీమార్ట్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో తొలివారంలో వెళ్లకపోవడం మంచిది. సోమవారం, మంగళవారాల్లో రద్దీ తక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో వెళితే సౌకర్యవంతంగా షాపింగ్ చేసుకోవచ్చు
-డీమార్ట్ సొంత బ్రాండ్ ఉత్పత్తులపై దృష్టి పెట్టండి. వీటి ధరలు మరింత తక్కువగా ఉంటాయి. అలాగే గడువు తేదీ ముగుస్తున్న వస్తువులపై భారీ తగ్గింపులను డీమార్ట్ అందిస్తోంది. దీంతో అలాంటి వస్తువుల గురించి ఒకసారి చెక్ చేయండి.