
నెల జీతం వచ్చిందంటే చాలు.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు డీమార్ట్‌కు పరుగులు పెడతారు. ఇంట్లోకి నెల మొత్తానికి కావాల్సిన కిరాణా సరుకులను ఒకేసారి కొనుగోలు చేస్తారు. ఈ షాపింగ్ మాల్‌లో ఇంటి అవసరాలకు అవసరమైన వస్తువులన్నీ ఒకేచోట లభిస్తాయి. అంతేకాకుండా వస్తువులపై భారీ డిస్కౌంట్స్, రాయితీలు అందుబాటులో ఉంటాయి. హోల్‌సేల్ ధరలకే ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వేర్వేరు వస్తువుల కోసం షాపులన్నీ తిరగాల్సిన పని ఉండదు. దీంతో షాపింగ్ చేయడం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వన్ అండ్ ఓన్లీ షాపింగ్ డెస్టినేషన్‌గా డీమార్ట్ మారిందని చెప్పవచ్చు.
అయితే డీమార్ట్‌కు షాపింగ్ చేయడానికి వెళ్లేటప్పుడు గృహిణులు ఏదైనా క్యారీ బ్యాగ్ ఖచ్చితంగా తీసుకెళతారు. కొనుగోలు చేసిన కిరాణా సరుకులను ఇంటికి తీసుకెళ్లేందుకు తమ వెంట ఎక్కువమంది బ్యాగ్ తెచ్చుకుంటారు. డీ మార్ట్‌లో వివిధ సైజులు, వివిధ రకారల్లో క్యారీ బ్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్లాస్టిక్, పేపర్, గుడ్డతో చేసిన బ్యాగ్‌లు ఉంటాయి. వీటి ధరలు రూ.12 నుంచి రూ.25 వరకు ఉంటాయి. పెద్ద బ్యాగ్ కావాలంటే ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది. బ్యాగ్ తీసుకెళ్లపోతే ప్రతీసారి షాపింగ్‌కు వెళ్లినప్పుడు దాని కోసం డబ్బులు ఖర్చు పెట్టా్ల్సి ఉంటుంది. దీంతో డబ్బులు పొదుపు చేసుకునేందుకు మహిళలు ఇంటి వద్ద నుంచే ఒక బ్యాగ్ పట్టుకెళ్తారు. కానీ చాలామందిలో ఒక డౌట్ ఉంటుంది. క్యారీ బ్యాగ్‌కు డబ్బులు చెల్లించారా.. లేదా అనే ప్రశ్న ఉంటుంది.
వినియోగదారుల పరిక్షణ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ప్రకారం షాపింగ్ మాల్స్ లేదా దుకాణాల్లో క్యారీ బ్యాగ్‌లకు అదనపు ఛార్జీలు వినియోగదారుడు చెల్లించాల్సిన అవసరం లేదు. మాల్స్, దురాణాలు, డీమార్ట్‌లలో బ్యాగ్ కోసం డబ్బులు వసూలు చేయకూడదు. వినియోగదారుల పరిరక్షణ కమిషన్ పలు కేసుల్లో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దీంతో మీరు డీమార్ట్‌కు వెళ్లినప్పుడు క్యారీ బ్యాగ్ కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియక డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. కొంతమందికి తెలిసినా ప్రశ్నించరు. రూ.20నే కదా అనుకుని లైట్ తీసుకుంటారు. హైదరాబాద్‌కు చెందిన ఆకాష్ కుమార్ అనే వ్యక్తి మే 2019లో, రూ. 602 విలువైన వస్తువులను డీమార్ట్‌లో కొనుగోలు చేశాడు. క్యారీ బ్యాగ్ కోసం అతడి నుంచి డీమార్ట్ రూ. 3.50 వసూలు చేశారు. దీంతో అతడు వినియోగదారుల ఫోరంను సంప్రదించగా.. క్యారీ బ్యాగ్‌లకు ఛార్జీ విధించాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది.