DMart: ఎన్నో సార్లు వెళ్లి ఉంటారు.. కానీ, డీమార్ట్‌లో డీ అంటే ఏంటో తెలుసా?

డీమార్ట్ నగరాల్లో నిత్యావసరాలకు ప్రాచుర్యం పొందిన సూపర్ మార్కెట్. తక్కువ ధరల వెనుక దాని ప్రత్యేక వ్యాపార విధానం ఉంది. వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని 2002లో డీమార్ట్‌ను ప్రారంభించారు. 'D' అనేది అతని పేరు దమాని నుండి వచ్చింది. సొంత భవనాలు, తయారీదారుల నుండి నేరుగా కొనుగోళ్లు వంటి వ్యూహాలు డీమార్ట్‌ను విజయవంతం చేశాయి.

DMart: ఎన్నో సార్లు వెళ్లి ఉంటారు.. కానీ, డీమార్ట్‌లో డీ అంటే ఏంటో తెలుసా?
D Mart

Updated on: Jul 11, 2026 | 2:29 PM

నిత్యావసర వస్తువుల కొనేందుకు నగరాల్లో ఉండేవారిలో ఎక్కువ మంది వెళ్లేది డీమార్ట్. బయటి కంటే అక్కడ తక్కువ ధరలు ఉంటాయని భావించి చాలా మంది అక్కడి వెళ్లి తమకు కావాల్సినవి కొనుగోలు చేస్తుంటారు. ఒకే చోట కిరాణా, గృహోపకరణాలు, దుస్తులు, కిచెన్ వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా డి-మార్ట్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే మీరు కూడా డీమార్ట్‌కు చాలా సార్లు వెళ్లి ఉంటే.. ఎప్పుడైనా ఆలోచించారా? అసలు డీ మార్ట్‌లో డీ అంటే ఏంటో? ఒక వేళ తెలియకుంటే దానికి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం..

డీమార్ట్‌ను ప్రముఖ పెట్టుబడిదారు రాధాకిషన్ దమాని 2002లో ప్రారంభించారు. స్టాక్ మార్కెట్‌లో విజయవంతమైన పెట్టుబడిదారుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, భారతీయ వినియోగదారుల కొనుగోలు అలవాట్లను అధ్యయనం చేసి రిటైల్ రంగంలోకి అడుగుపెట్టారు. దమానీ మార్ట్ అనే పేరును సంక్షిప్తంగా డీ-మార్ట్‌గా మార్చారు. దీనిని నిర్వహిస్తున్న సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్.

తక్కువ ధరలు..

డీ-మార్ట్‌లో వస్తువులు ఇతర సూపర్ మార్కెట్లతో పోలిస్తే తక్కువ ధరలకు లభించడానికి ప్రధాన కారణం దాని ప్రత్యేక వ్యాపార విధానం. చాలా స్టోర్లను అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాల్లోనే ఏర్పాటు చేయడం వల్ల అద్దె ఖర్చు తగ్గుతుంది. అలాగే తయారీ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో నేరుగా వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ధరలకు సరుకులు పొందుతుంది. ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు తగ్గింపు రూపంలో అందిస్తుంది.

మొత్తంగా చూస్తే డీమార్ట్ కేవలం ఒక సూపర్ మార్కెట్ మాత్రమే కాదు. తక్కువ ధరలు, సమర్థవంతమైన వ్యాపార నమూనా, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సేవలతో కోట్లాది భారతీయ కుటుంబాల నిత్యజీవితంలో భాగంగా మారింది. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశాలతో భారత రిటైల్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us