బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి కూడా ఉండాల్సిందే! లేదంటే రిజెక్టే!

నా సిబిల్‌ స్కోర్ 750పైగా ఉంది నాకు ఏ బ్యాంక్‌లోనైనా ఈజీగా లోన్ వస్తుంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.. అదంతా ఒప్పుడు ఇప్పుడు రూల్స్ అన్ని మారిపోయాయి. మీ సిబిల్‌ ఒక్కటి మంచిగా ఉంటే సరిపోదు.. ఈ రోజుల్లో మీకు లోన్‌ ఇవ్వాలంటే బ్యాంక్‌లు సిబిల్‌తో కొన్ని కండీషన్స్‌ పెట్టాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి కూడా ఉండాల్సిందే! లేదంటే రిజెక్టే!
Good Cibil Score But Loan Rejected

Updated on: Jun 12, 2026 | 6:30 AM

ఒకప్పుడు బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలంటే జస్ట్ సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే సరిపోయేది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండి, సరైన పత్రాలు ఉంటే ఈజీగా లోన్ దొరికేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత కేవలం 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నంత మాత్రాన లోన్ వచ్చేస్తుందనుకుంటే పొరపాటే. లోన్ మంజూరు చేయడానికి బ్యాంకులు సిబిల్ స్కోర్‌తో పాటు ఇతర ముఖ్యమైన అంశాలను కూడా పరిశీలిస్తున్నాయి. అవేంటో చూద్దాం పదండి

లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు చూసే ఇతర అంశాలు

ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌తో పాటు లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి యొక్క పూర్తి ప్రొఫైల్‌ను కూడా చూస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా మీ ఆదాయం స్థిరంగా ఉందా లేదా ప్రస్తుతం మీపై ఏవైనా లోన్స్ ఉన్నాయా? మీరు ఏం జాబ్ చేస్తున్నారు. మీరు ఇంతకుముందు ఎలాంటి లోన్స్ తీసుకున్నారు.. అలా తీసుకున్న లోన్స్ సరిగ్గా కడుతున్నారా లేదా అనే అన్నింటిని పరిగణలోకి తీసుకొని బ్యాంక్స్ లోన్ మంజూరు చేస్తున్నాయి.

మీ సిబిల్ బాగున్నా లోన్ రాకపోవడానికి కారణాలు ఇవే

అస్థిరమైన ఆదాయం: లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు దరఖాస్తుదారునికి వచ్చే క్రమబద్ధమైన ఆదాయాన్ని చూస్తాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటే లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఎక్కవ లోన్స్: లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఇప్పటికే తన నెలవారీ ఆదాయంలో 40 నుండి 50 శాతం వరకు పాత ఈఎంఐల కోసమే ఖర్చు చేస్తుంటే, బ్యాంకులు అతన్ని అప్పులపై ఎక్కువగా ఆధారపడే వ్యక్తిగా పరిగణిస్తాయి. దీనివల్ల కొత్త లోన్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఉద్యోగంలో స్థిరత్వం: మీరు తరచూ ఉద్యోగాలు మారడం, స్థిరంగా ఒక దగ్గర ఉద్యోగం చేయకుంటే, సరైన ఆదాయ ఆధారాలు లేకుండా స్వయం ఉపాధి చేసుకుంటే కూడా లోన్‌ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సిబిల్ రిపోర్టులో తప్పులు: సిబిల్ నివేదికలో వ్యక్తిగత వివరాలు తప్పుగా ఉండటం లేదా గతంలో తీసుకున్న లోన్లను పూర్తిగా సెటిల్ చేయకపోవడం వంటివి కూడా లోన్ రిజెక్ట్ కావడానికి ముఖ్య కారణాలు అవుతాయి.

కాబట్టి, మీ సిబిల్ స్కోర్ ఎంత బాగున్నా.. పైన పేర్కొన్న విషయాలలో లోపాలు ఉంటే బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను తిరస్కరించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us